ETV Bharat / sports

పంత్ అక్సర్ మెరుపులు - గుజరాత్​పై దిల్లీ విజయం - IPL 2024 - IPL 2024

IPL 2024 Delhi Capitals vs Gujarat Titans : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

పంత్ అక్సర్ మెరుపులు - గుజరాత్​పై దిల్లీ విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 11:18 PM IST

IPL 2024 Delhi Capitals vs Gujarat Tita mns : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఫలితంగా దిల్లీ 4 పరుగులు తేడాతో విజయం సాధించింది.

గుజరాత్ ఇన్నింగ్స్​లో సాయి సుదర్శన్​(39 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్​ల సాయంతో 65 పరుగులు), డేవిడ్ మిల్లర్(23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్​ల సాయంతో 55 పరుగులు), వృద్ధిమాన్ సాహా(25 బంతుల్లో 1 సిక్స్​​, 5 ఫోర్ల సాయంతో 39 పరుగులు) స్కోర్లు చేశారు. షారుక్ ఖాన్(8), రాహుల్ తెవాతియా(4), రషీద్ ఖాన్​(21), రవి శ్రీనివాస్​ సాయి కిశోర్​(13) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో రాసిఖ్​ దర్ సలామ్​ 3, కుల్దీప్ యాదవ్ 2, అన్రిచ్ నోర్జే, ముకేశ్ కుమార్​, అక్సర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దిల్లీ బ్యాటర్లలో పంత్‌తో పాటు అక్షర్‌ పటేల్‌(43 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సల సాయంతో 66 పరుగులు), స్టబ్స్‌(26) పరుగులతో రాణించారు. కెప్టెన్ పంత్ అయితే విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు గుజరాత్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అక్షర్ పటేల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన మొహిత్ శర్మను బెంబేలెత్తించాడు. 20 ఓవర్‌లో పంత్ 4 సిక్స్‌లు, ఒక ఫోరుతో 31 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కేవలం 43 బంతులు ఎదుర్కొన్న పంత్​ 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఇక పంత్ బ్యాటింగ్‌ చూసిన క్రికెట్ అభిమానులు వరల్డ్‌కప్‌న్‌కు పంత్ రెడీ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 3 వికెట్లు తీయగా నూర్‌ ఆహ్మద్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.

పాకిస్థాన్​కు టీమ్​ఇండియా - మరోసారి స్పందించిన బీసీసీఐ! - Champions Trophy 2025

సన్​రైజర్స్​ కావ్య మారన్​ లగ్జరీ కార్ల కలెక్షన్స్ - వామ్మో అన్ని కోట్లు పెట్టి కొనిందా? - Kavya Maran Luxury cars

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.