ETV Bharat / sports

ఒక్క ఇన్నింగ్స్​ - ఐదు రికార్డులు సాధించిన మహీ భాయ్ - IPL 2024 DC VS CSK - IPL 2024 DC VS CSK

IPL 2024 DC VS CSK Dhoni Five Records : ఐపీఎల్ 2024లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ధోనీ బౌండరీలు, సిక్స్​లు బాదుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశాడు. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్​లోనే మహీ ఐదు రికార్డులను సాధించాడు. అదేంటంటే?

ఒక్క ఇన్నింగ్స్​ - ఐదు రికార్డులు సాధించిన మహీ భాయ్

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 1:26 PM IST

Updated : Apr 1, 2024, 2:26 PM IST

IPL 2024 DC VS CSK Dhoni Five Records : ఐపీఎల్ 2024లో భాగంగా వైజాగ్​ వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ ధోనీ బౌండరీలు బాదుతూ హోరెత్తించాడు. చివర్లో వచ్చి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సీజన్​లో ఇదే అతడికి తొలి మ్యాచ్​. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్​లోనే మహీ ఐదు రికార్డులను సాధించాడు. అదేంటంటే?

  • టీ20 క్రికెట్‌లో 7000 పరుగులు సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా మహీ రికార్డు క్రియేట్ చేశాడు.
  • ఓ ఓవర్‌లో 20 లేదా 20కు పైగా పరుగులను అత్యధిక సార్లు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు.
  • 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
  • ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్‌‌గానూ ఘనత సాధించాడు.
  • వికెట్ కీపర్‌గానూ మహీ మరో ఘనతను సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 300 వికెట్లు సాధించడంలో పాలు పంచుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.

ధోనీ కోసం స్పెషల్ వీడియో - ఇకపోతే వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సీఎస్కే ఓడిపోయింది. 20 పరుగులు తేడాతో రిషభ్ పంత్ కెప్టెన్సీలోని దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. కానీ ఫ్యాన్స్ మాత్రం అస్సలు కొంచెం కూడా బాధపడలేదు. ఎందుకంటే ధోనీ వింటేజ్ మహీని గుర్తు చేస్తూ సునామీ ఇన్నింగ్స్​ ఆడటమే ఇందుకు కారణం. ఇంకా చెప్పాలంటే అది చెన్నై జట్టుకు హోం గ్రౌండ్​ కాకపోయినప్పటికీ మహీ కోసమే మ్యాచ్‌కు వచ్చామా? అన్నట్లుగా వాతావరణం అంతా మారిపోయింది. ప్రేక్షకులు ధోనీ నామస్మరణతో మైదానాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో వైజాగ్‌ స్టేడియంలో మహీ ఎంట్రీ నుంచి అతడి బ్యాటింగ్‌ దిగినంత వరకు జరిగిన మూమెంట్స్​ను జత చేసి ఓ స్పెషల్ వీడియోను ఐపీఎల్‌ నిర్వాహకులు తమ అధికార సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దాన్ని మీరు చూసేయండి.

కోహ్లీ, ధోనీ ఇద్దరూ ఇద్దరే - మోత మోగించేశారు! - Dhoni Kohli

ఐపీఎల్‌ 2024 @10 డేస్​ - హిట్ ఫ్లాప్​​ ప్రదర్శనలు ఇవే! - IPL 2024

Last Updated : Apr 1, 2024, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.