Indian Weightlifters In Olympics : ఒలింపిక్స్‌లో అత్యంత ఆసక్తికరమైన క్రీడల్లో ఒకటిగా వెయిట్ లిఫ్టింగ్ ఫేమస్ అయ్యింది. అయితే ఈ క్రీడా చాలా ప్రమాదకరం. ఒక చిన్న తప్పు చేస్తే చాలు, అథ్లెట్ భారీ ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఈ క్రీడ ఎలా మొదలైంది? ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ల ప్రస్థానం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.
ఈ చారిత్రాత్మక క్రీడ మూలాలు ఆఫ్రికా, దక్షిణ ఆసియా, ఆధునిక గ్రీస్‌లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (IWF) అనే గవర్నెంగ్ బాడీ 1905లో ఏర్పడగా, దీని ద్వారా ఈ క్రీడా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌కి శాశ్వత స్థానం కల్పించడంలోనూ ఇది కీలక పాత్ర పోషించింది.
ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ చరిత్ర
వెయిట్‌లిఫ్టింగ్ 1896లో తొలిసారి ప్రవేశపెట్టారు. అయితే ఈ క్రీడలో అప్పటికి, ఇప్పటికీ చాలా తేడాలు వచ్చాయి. 1896 ఒలింపిక్స్‌లో రెండు ఈవెంట్స్, అంటే ఒక చేత్తో ఎత్తడం, రెండు చేతులతో ఎత్తడం నిర్వహించారు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన లాన్సెస్టన్ ఇలియట్ వన్ హ్యాండ్ ఛాంపియన్‌గా నిలవగా, డెన్మార్క్‌కు చెందిన విగ్గో జెన్సన్ టూ హ్యాండ్స్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచాడు.
ఆ తర్వాత 1920 వరకు ఈ క్రీడ కనిపించలేదు. ఆ తర్వాత నుంచి ఇది ఓ సాధారణ ఈవెంట్‌గా మారింది. 1924 ఒలింపిక్స్ తర్వాత వన్ హ్యాండ్ ఈవెంట్‌ను తొలగించారు. 1928 ఒలింపిక్స్ సమయానాకి, లిఫ్టులు స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, క్లీన్ అండ్ ప్రెస్ వంటి మూడు-దశల ప్రక్రియగా మారాయి.
1972లో వెయిట్‌లిఫ్టర్‌ల టెక్నిక్‌ని అంచనా వేయడంలో ఇబ్బందులు ఉండటం వల్ల క్లీన్ అండ్ ప్రెస్ ప్రక్రియను తొలగించారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్ నుంచి మహిళల వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభమైంది.
ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన
పైరోస్ డిమాస్ (గ్రీస్) : 1992 నుంచి 2004 వరకు 82.5/83/85 కిలోల విభాగాల్లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్యం గెలిచాడు. అకాకియోస్ కకియాస్విలిస్ (గ్రీస్), హలీల్ ముట్లు (టర్కీ), నయీమ్ సులేమనోగ్లు (టర్కీ) ఒక్కొక్కరు ఒక్కో స్వర్ణం సాధించారు. చెన్ యాంకింగ్ (చైనా), హ్సు షు-చింగ్ (దక్షిణ కొరియా) 58 కేజీలు, 53 కేజీల విభాగాల్లో వరుసగా రెండు స్వర్ణాలు సాధించారు.
ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ట్రాక్ రికార్డు
1948 : తొలిసారిగా భారత్ తరఫున డేనియల్ పొన్ మోనీ పురుషుల ఫెదర్‌వెయిట్‌లో పాల్గొన్నాడు. ఫైనల్లో 280 కిలోలు ఎత్తి, 16వ స్థానంలో నిలిచాడు. దండమూడి రాజగోపాల్ పురుషుల లైట్ వెయిట్‌లో పాల్గొన్నప్పటికీ చివరి స్థానంలో నిలిచాడు.
1984 : మహేంద్రన్ కన్నన్(ఫ్లైవెయిట్ ), దేవేన్ గోవిందసామి(బాంటమ్ వెయిట్) ఫైనల్లో టాప్ టెన్‌లో నిలిచారు.
2000 : మహిళల 69 కిలోల విభాగంలో కరణం మల్లీశ్వరి భారతదేశానికి మొదటి వెయిట్ లిఫ్టింగ్ పతకాన్ని (కాంస్యం) అందించింది.
2004 : మహిళల 48 కిలోల విభాగంలో కుంజరాణి దేవి తృటిలో పతకాన్ని కోల్పోయింది. నాలుగో స్థానంలో నిలిచింది.
2021: మీరాబాయి చాను టోక్యోలో మొత్తం 202 కిలోలు ఎత్తి రజత పతకాన్ని గెలుచుకుంది.
వెయిట్ లిఫ్టింగ్ నియమాలు
వెయిట్ లిఫ్టింగ్ రెండు ప్రధాన లిఫ్ట్‌లను కలిగి ఉంటుంది : స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్.
స్నాచ్ : లిఫ్టర్ బార్‌బెల్‌ను లిఫ్ట్ చేసి, ఒకే స్మూత్ మోషన్‌లో తల పైకి ఎత్తాలి.
క్లీన్ అండ్ జెర్క్ : లిఫ్టర్ మొదట బార్‌బెల్‌ను తమ ఛాతీ (క్లీన్) పై వరకు లిఫ్ట్ చేస్తాడు. తర్వాత దాన్ని తలపైకి (జెర్క్) లేపుతాడు.
వెయిట్లిఫ్టింగ్కు ప్రతి విభాగంలో మూడు అవకాశాలు ఉంటాయి. రెండింటిలో సాధించిన స్కోర్‌ని అథ్లెట్ టోటల్ స్కోర్‌గా లెక్కిస్తారు. ముందుగా అత్యల్ప బరువును ఎత్తాలని నిర్ణయించుకున్న అథ్లెట్ ఛాన్స్ తీసుకోవాలి. వెయిట్‌లిఫ్టర్‌లు తమ పేరును పిలిచిన ఒక నిమిషంలోగా వచ్చి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.
పారిస్ 2024లో భారతీయ వెయిట్ లిఫ్టర్లు
మీరాబాయి చాను (49 కేజీలు): మీరాబాయి చాను తన మూడో ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. టోక్యో 2021 ఒలింపిక్స్‌లో 48 కిలోల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న రెండో భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. ఇటీవలే గాయం నుంచి కోలుకుంది. భారత్‌కి పతకం అందిస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. పారిస్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో 12వ స్థానంలో నిలిచింది.
ఒలింపిక్స్ పతకాలు- టాప్‌లో USA- భారత్ ఖాతాలో ఎన్నంటే? - Paris Olympics 2024
ఒలింపిక్స్ వల్ల ఆతిథ్య దేశాలకు లాభమా? నష్టమా? - Paris Olympics 2024