ETV Bharat / sports

భారత్ X న్యూజిలాండ్ టెస్టు - టాస్ పడకుండానే తొలి రోజు ఆట రద్దు - IND VS NZ TEST 2024

IND vs NZ Test 2024 : భారత్- న్యూజిలాండ్ తొలి టెస్టులో టాస్ పడకుండానే మొదటి రోజు ఆట రద్దైంది.

India vs New Zealand
India vs New Zealand (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 16, 2024, 3:04 PM IST

IND vs NZ Test 2024 : భారత్- న్యూజిలాండ్ తొలి టెస్టులో టాస్ పడకుండానే మొదటి రోజు ఆట రద్దైంది. మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న బెంగళూరు నగరంలో భారీ వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారింది. బుధవారం మధ్యాహ్నానికి వర్షం తగ్గినప్పటికీ ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడం వల్ల తొలి రోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అయితే ఒక రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టికుపోయిన కారణంగా గురువారం గేమ్ త్వరగా ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఉదయం 8.45 గంటలకు టాస్, 9.15 గంటలకు మ్యాచ్ ప్రారంభించనున్నట్లు షెడ్యూల్ ఫిక్స్​ చేశారు. కానీ, రెండో రోజుకు కూడా వర్షం ముప్పు ఉందని తెెలుస్తోంది. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అధునాతన డ్రైనేజీ సిస్టమ్ ఉండడం కాస్త సానుకూలాంశం. చూడాలి మరి గురువారం ఆట ఏ మాత్రం సాధ్యం అవుతుందో!

రివైజ్ షెడ్యూల్ ప్రకారం సెషన్స్ టైమింగ్స్

  • మార్నింగ్ సెషన్ - 9:15 AM - 11:30 AM
  • మధ్యాహ్నం సెషన్ - 12:10 PM - 02:25 PM
  • సాయంత్రం సెషన్ - 02:45 PM - 04:45 PM

లైవ్ స్ట్రీమింగ్ - ఈ పర్యటనలో భారత్​తో కివీస్ మూడు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. ఈ మ్యాచ్​లన్నీ లైవ్‌లో స్పోర్ట్స్ 18 ఛానల్‌లో వీక్షించొచ్చు. కలర్స్​ సినీ ప్లెక్స్​లోనూ చూడొచ్చు. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ జియో సినిమాలోకూడా స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. జియో సినిమా వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా లైవ్‌ను చూడొచ్చు.

తుది జట్లు అంచనా

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్‌/ సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్‌/ కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌

న్యూజిలాండ్‌: డేవన్ కాన్వే, టామ్ లేథమ్, విల్‌ యంగ్, రచిన్‌ రవీంద్ర, డారిల్ మిచెల్, బ్లండెల్, గ్లెన్‌ ఫిలిప్స్, బ్రాస్‌వెల్, టిమ్ సౌథీ, అజాజ్, ఒరూర్కె టా

కివీస్​తో తొలి టెస్ట్​లో ఆగని వర్షం - సబ్‌ఎయిర్‌ సిస్టమ్‌ కాపాడుతుందా?

భారత్. న్యుజిలాండ్​ తొలి టెస్ట్​ - OTTలో ఎక్కడ చూడాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.