India Tour Of Zimbabwe 2024 Squad: జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. 15మందితో కూడిన జట్టును బీసీసీఐ వెల్లడించింది. ముందుగా ప్రచారం సాగినట్లుగానే యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఈ పర్యటనకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి తొలిసారి టీమ్ఇండియా పిలుపు అందింది. కాగా, జూలై 6న జింబాబ్వే పర్యటన ప్రారంభం కానుంది. టీమ్ఇండియా ఈ టూర్లో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఐపీఎల్ స్టార్స్‌కు ఛాన్స్: అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఐపీఎల్ 17వ సీజన్‌లో ఆకట్టుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్ రెడ్డి 142.92 స్టైక్ రేట్‌తో 303 పరుగులతో రాణించాడు. అలాగే అభిషేక్ 484 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఏకంగా 573 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌తో వీళ్లు అంర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నారు. ఇక రెండో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌కు జట్టులో చోటు లభించింది.
సీనియర్లకు రెస్ట్
కాగా, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత వీళ్లంతా న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
పర్యటన షెడ్యూల్
తొలి టీ20 | జూలై 6 |
రెండో టీ20 | జూలై 7 |
మూడో టీ20 | జూలై 10 |
నాలుగో టీ20 | జూలై 13 |
ఐదో టీ20 | జూలై 14 |
- అన్ని మ్యాచ్‌లకు హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికకానుంది. అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.
All The Details 🔽https://t.co/AfbNpH167H#TeamIndia | #ZIMvIND
— BCCI (@BCCI) June 24, 2024