ETV Bharat / sports

టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియా సంచలన రికార్డ్​ - 147 ఏళ్లలో తొలిసారి ఇలా

న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి టెస్ట్​లో సంచలన రికార్డ్ అందుకున్న టీమ్ ఇండియా - అదేంటంటే?

IND VS NZ 1st Test Teamindia 100 Sixes
IND VS NZ 1st Test Teamindia 100 Sixes (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 19, 2024, 7:20 AM IST

IND VS NZ 1st Test Teamindia 100 Sixes : టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియా సంచలన రికార్డ్​ సాధించింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరో జట్టు అందుకోని అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్‌ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు బాదిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఈ ఘనతను అందుకోలేదు.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా తొలి టెస్ట్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్​తోనే భారత జట్టు ఈ 100 సిక్స్​ల మార్క్​ను టచ్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్​ కోహ్లీ బాదిన భారీ సిక్సర్‌తో భారత్​ జట్టు 100 సిక్స్‌ల మైలురాయిని అందుకుంది.

ఈ ఏడాది ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడింది టీమ్ ఇండియా. ఇప్పటి వరకు 102 సిక్స్‌లు కొట్టింది. ఈ జాబితాలో భారత జట్టు తర్వాత ఇంగ్లాండ్ (2022) 89 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, 87 సిక్స్​లతో మూడో స్థానంలో మళ్లీ భారతే (2021) నిలిచింది. ఆ తర్వాతి నాలుగు ఐదు స్థానాల్లో న్యూజిలాండ్ (2014 - 81, 2013 - 71) నిలిచింది.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు భారత జట్టు మొత్తం ఐదు సిక్స్‌లు బాదింది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెరొక సిక్స్ బాదగా, సర్ఫరాజ్ ఖాన్ మూడు సిక్స్‌లు కొట్టాడు. ఈ ఏడాది ముగిసేలోపు టీమ్ ఇండియా ఈ రికార్డ్‌ను మరింత మెరుగు చేసుకుంటుంది. కనీసం 150 సిక్స్‌ల మైలురాయిని అందుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

విరాట్ ఖాతాలో మరో ఘనత​- ఆ మైల్​స్టోన్ అందుకున్న నాలుగో బ్యాటర్​గా రికార్డ్

మూడో రోజు పుంజుకున్న భారత్- రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.