IND VS Newzealand Kohli 9 Thousand Runs : మరో రోజులో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే అందరి దృష్టి ఇప్పుడు స్టార్ బ్యాటర్ కోహ్లీపైనే ఉంది. ఎందుకంటే విరాట్ ఈ ఏడాది టెస్టుల్లో ఇప్పటి వరకు హాఫ్ సెంచరీ బాదలేదు. 2024లో ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ, దక్షిణాఫ్రికాపై 46 పరుగులు, రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్‌పై 47 రన్స్ చేసి తృటిలో అర్ధ శతకాలను మిస్ చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సారైనా అతడు హాఫ్ సెంచరీ బాదుతాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో విరాట్ ఓ రికార్డును ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.
కోహ్లీ మరో 53 పరుగులు సాధిస్తే సుదీర్ఘ ఫార్మాట్‌లో 9,000 వేల పరుగులను పూర్తి చేసుకున్నట్టవుతుంది. టీమ్ ఇండియా తరఫున ఇప్పటి వరకు ఈ ఫీట్‌ను ముగ్గురు మాత్రమే ఖాతాలో వేసుకున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265 పరుగులు), సునీల్ గావస్కర్ (10,122 పరుగులు) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. చూడాలి మరి విరాట్ ఈ కివీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లోనైనా హాఫ్ సెంచరీ బాదడంతో పాటు 9 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడా లేదా.
రీసెంట్‌గానే టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఫామ్‌పై మాట్లాడాడు. కోహ్లీ తిరిగి పుంజుకుంటాడని, వచ్చే సిరీస్‌ల్లో అతడు కచ్చితంగా అదరగొడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ పరుగుల ఆకలితోనే ఉన్నాడని, ఆ ఆకలే అతడిని ప్రపంచస్థాయి ఆటగాడిగా మార్చిందని అన్నాడు.
టెస్టు షెడ్యూల్
తొలి టెస్టు
అక్టోబర్ 16 - 20, వేదిక - బెంగళూరు
రెండో టెస్టు
అక్టోబర్ 24 - 28, వేదిక - పుణె
మూడో టెస్టు
నవంబర్ 1 - 5, వేదిక - ముంబయి
టీమ్ ఇండియా జట్టు ఇదే - కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించనున్నారు. జట్టులో యశస్వి, శుభ్‌మన్, కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్, ధ్రువ్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్ చోటు సంపాదించుకున్నారు. ట్రావెల్ రిజర్వ్ ఆటగాళ్లుగా హర్షిత్ రాణా, నితీశ్ కుమార్‌రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.
టీమ్ఇండియాతో టెస్ట్ సిరీస్ - న్యూజిలాండ్‌కు మరో భారీ షాక్!
కివీస్‌తో టెస్ట్ సిరీస్ - రోహిత్ శర్మను ఊరిస్తున్న ఆ 5 రికార్డులు