ETV Bharat / sports

పొట్టికప్​లో 'భారత్' బోణీ- ఐర్లాండ్​పై ఆల్​రౌండ్ షో - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Ind vs Ire T20 World Cup 2024: 2024 టీ20 వరల్డ్​కప్​లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. ఐర్లాండ్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో నెగ్గింది.

Ind vs Ire T20
Ind vs Ire T20 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 10:59 PM IST

Ind vs Ire T20 World Cup 2024: 2024 టీ20 వరల్డ్​కప్​లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 12.2 ఓవర్లలో సునాయసంగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52 పరుగులు: 37 బంతుల్లో: 4x4, 3x6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రిషభ్ పంత్ (36* పరుగులు) రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్, బెంజామిన్ వైట్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

రోహిత్- విరాట్ జోడీ: అందరూ అన్నట్లుగానే ఈ మ్యాచ్​లో రోహిత్​తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్​ ప్రారంభించాడు. దీంతో ఈ స్టార్ జోడీయే మ్యాచ్​ ముగిస్తుందని అనుకున్నారు. కానీ, మూడో ఓవర్లో భారీ షాట్​కు ప్రయత్నించిన విరాట్ క్యాచౌట్​గా పెవిలియన్​ చేరాడు. దీంతో 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇక వన్​డౌన్​లో దిగిన పంత్​తో రోహిత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఆ పిచ్​పై ఇతర బ్యాటర్లు సింగిల్స్ తీయడానికి కష్టపడుతుంటే రోహిత్ బౌండరీలతో అలరించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 30వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 52 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్​గా రోహిత్ క్రీజును వదిలాడు. చివర్లో సూర్య భారీ షాట్​కు యత్నించి ఔటయ్యాడు. తర్వాత పంత్ మ్యాచ్​ ముంగించాడు.

రోహిత్ @4000: రోహిత్ శర్మ టీ20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 26 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ టీ20ల్లో 4026 పరుగులు బాదాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక పరుగులు బాదిన టాప్​ 2 బ్యాటర్​గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (4038) టాప్​లో ఉండగా పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (4023) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్​లో రోహిత్ 1000 టీ20 వరల్డ్​కప్​ పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు.

అక్షర్ @50: స్పిన్నర్​ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్​లో ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అక్షర్ టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు 53 మ్యాచ్​ల్లో 50 వికెట్లు పడగొట్టాడు. 3-9 అత్యుత్తమ ప్రదర్శన.

కుప్పకూలిన ఐర్లాండ్- టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే?

విరాట్ అరుదైన ఘనత- టాప్ 2 అథ్లెట్​గా కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.