IND VS ENG 2nd Test KL Rahul Jadeja : ఇంగ్లాండ్‌తో విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమ్ ఇండియాలో కొన్ని మార్పులు జరిగాయి. గాయాల కారణంగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఈ రెండో టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ తెలిపింది. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో స్థానం కల్పించినట్లు పేర్కొంది.
"వైజాగ్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. తొలి టెస్ట్ నాలుగో రోజు ఆటలో గాయపడిన జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. రాహుల్ కూడా కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ పర్యవేక్షణలో ఉన్నారు" అని బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. దీంతో అతడు ఇబ్బంది పడుతూనే మైదానాన్ని వీడాడు. ఇప్పుడా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇక రాహుల్ కూడా ఫీల్డింగ్ చేసినప్పుడు కండరాల నొప్పితో బాధపడినట్లు తెలిసింది. అందుకే అతడికి కూడా రెస్ట్ ఇచ్చింది బోర్డు.
Ind Vs Eng 2nd Test 2024 : బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ రెండో టెస్టు కోసం ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులోకి చేర్చింది. ఎప్పటి నుంచో జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముంబయి బ్యాటర్ సర్ఫారాజ్ ఖాన్‌కు ఛాన్స్ ఇచ్చారు సెలక్టర్లు. ఇతడితో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ఈ రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో టీమ్ ఇండియా పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది.
-
The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV
— BCCI (@BCCI) January 29, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV
— BCCI (@BCCI) January 29, 2024The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV
— BCCI (@BCCI) January 29, 2024
'విరాట్‌ను చూసి వాళ్లు నేర్చుకోవాలి- కోహ్లీకి ఇప్పటికీ ఆ సమస్య రాలేదు'