Ind Vs Eng 1st Test Day 4 : హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ ఓటమి చెందింది. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మరొక రోజు ఆట మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. రోహిత్ (39), అశ్విన్(28), శ్రీకర్ భరత్(28), కేఎల్ రాహుల్ (22) పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు ఫెయిల్ అయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో టామ్ హార్ట్‌లే 7, జో రూట్, జాక్ లీచ్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మ్యాచ్ సాగిందిలా : 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ మంచి ఓపెనింగ్‌ను అందించారు. జైశ్వాల్ 15 పరుగులు చేసి ఔట్ అవ్వగా, రోహిత్ శర్మ 39 పరుగులు చేసి టామ్ హార్ట్‌లే బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు ఏవరూ కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయాపరు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
శుభ్‌మన్ గిల్ మరోసారి వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నిలకడగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 22 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌ను రూట్ దెబ్బకొట్టాడు. దీంతో భారత్ 32.4 ఓవర్లలో 107 పరుగులు చేసి ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రవీంద్ర జడేజా 119 పరుగుల వద్ద రనౌట్ కాగా, చివరల్లో అశ్విన్(28), భరత్28) జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ అవ్వడం వల్ల భారత్ ఆశలు ఆవిరయ్యాయి. అశ్విన్ - భరత్ ఔట్ అయ్యాక బుమ్రా, సిరాజ్ కాసేపు క్రీజ్‌లో ఉండి పోరాడినప్పటికీ విజయతీరాలకు చేర్చలేకపోయారు.
-
It came right down to the wire in Hyderabad but it's England who win the closely-fought contest.#TeamIndia will aim to bounce back in the next game.
— BCCI (@BCCI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/OcmEgKCjUT
">It came right down to the wire in Hyderabad but it's England who win the closely-fought contest.#TeamIndia will aim to bounce back in the next game.
— BCCI (@BCCI) January 28, 2024
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/OcmEgKCjUTIt came right down to the wire in Hyderabad but it's England who win the closely-fought contest.#TeamIndia will aim to bounce back in the next game.
— BCCI (@BCCI) January 28, 2024
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/OcmEgKCjUT
కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 3, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్‌లే 7 వికట్లు తీసి టీమ్ఇండియా పతనాన్ని శాసించాడు.
68 పరుగులకు 7 వికెట్లు - క్రికెట్ స్టార్‌గా మారిన సెక్యురిటీ గార్డు
విండీస్ గెలుపుపై రియాక్షన్ - స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా