Ind vs Aus T20 World cup 2024 : 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ అంతిమ సమరం, నిరుడు వన్డే వరల్డ్ కప్ తుది పోరు ఇంకా చాలా ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ఇండియాను ఓడించిన కంగారులు, ఇప్పుడు మనోళ్ల చేతిలో ఓటమిని చూశారు. వారి సెమీస్ అవకాశాలను దెబ్బ కొడుతూ రోహిత్ సేన ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్తోంది.
తాజాగా జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా - భారత్ తలపడ్డాయి. ఈ పోరులో బ్యాటుతో, బంతితో ఆధిపత్యం చెలాయించిన టీమ్‌ఇండియా ఆసీస్ టీమ్‌ను 24 పరుగుల తేడాతో ఓడించి సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. దీంతో కంగారుల భవితవ్యం అఫ్గానిస్థాన్ - బంగ్లాదేశ్ రిజల్ట్‌పై ఆధారపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (0) మరోసారి నిరాశపర్చినా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ (92; 41 బంతుల్లో 7×4, 8×6) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య కుమార్ (31; 16 బంతుల్లో 3×4, 2×6), శివమ్ దూబె (28; 22 బంతుల్లో 2×4, 1×6), హార్దిక్ పాండ్య (27 నాటౌట్; 17 బంతుల్లో 1×4, 2×6) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ చెరో 2, హేజిల్‌వుడ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం కుల్‌దీప్ యాదవ్ (2/24), అర్ష్‌దీప్ (3/37)ల దెబ్బకు ఆసీస్ 7 వికెట్లకు 181 పరుగులే చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో 9×4, 4×6) మరోసారి రెచ్చిపోయేలా కనిపించినా చివరికి అతడు ఓటమి వైపే నిలిచాడు. మిచెల్ మార్ష్ (37; 28 బంతుల్లో 3×4, 2×6) కూడా కీలకమైన ఇన్నింగ్సే ఆడాడు. బుమ్రా, అక్సర్ పటేల్ కూడా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇకపోతే గురువారం(జూన్ 27) సెమీస్‌లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌తో పోటీ పడనుంది.
A jaw-dropping Rohit Sharma knock 🤯
— ICC (@ICC) June 24, 2024
His outlandish innings has put India on track for a huge first innings total 👏#T20WorldCup | #AUSvIND | 📝: https://t.co/IhR6GJvjto pic.twitter.com/NffDWKgR5p
ఆసీస్‌పై రోహిత్ దండయాత్ర- సిక్సర్లతో హిట్‌మ్యాన్ విధ్వంసం - T20 World Cup
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో హ్యాట్రిక్ వీరులు- ఏకైక బౌలర్‌గా కమిన్స్ రికార్డ్ - T20 World Cup 2024