P R Sreejesh Jersey: భారత హాకీ జట్టు స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ జెర్సీ నెం.16ని రిటైర్ చేస్తున్నట్లు ఇండియా హాకీ తాజాగా ప్రకటించింది. జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషుల సీనియర్ టీమ్‌లో ఈ నెంబర్ జెర్సీని మరొకరికి కేటాయించరు. కానీ, జూనియర్ హాకీ జట్టులో మాత్రం యాథావిధిగా నెం. 16 జెర్సీ ఉండనుంది. ఈ మేరకు హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ భోళా నాథ్ సింగ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
'పురుషుల సీనియర్ హాకీ టీమ్ నుంచి శ్రీజేశ్ జెర్సీ నెం.16ను రిటైర్ చేస్తున్నాం. ఇకపై ఈ నెంబర్ జెర్సీ ఇంకెవరికీ ఉండదు. అయితే జూనియర్ హాకీ జట్టులో మాత్రం నెం.16 జెర్సీ కనిపిస్తుంది. ఇక శ్రీజేశ్ ఇప్పుడు జూనియర్ హాకీ టీమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అతడు మరికొంత మందిని శ్రీజేశ్గా తీర్చిదిద్దాల్సి ఉంది' అని నాథ్ సింగ్ అన్నారు.
🇮🇨🇴🇳🇮🇨 🇯🇪🇷🇸🇪🇾 🇳🇴 1️⃣6️⃣ 🇳🇴🇼 🇼🇮🇱🇱 🇳🇴🇼 🇧🇪 🇦 🇵🇦🇷🇹 🇴🇫 🇮🇳🇩🇮🇦🇳 🇭🇴🇨🇰🇪🇾 🇫🇴🇱🇰🇱🇴🇷🇪.
— Hockey India (@TheHockeyIndia) August 14, 2024
Hockey India has decided to retire the Jersey… pic.twitter.com/MCv4VtSnZe
కాగా, గత రెండు ఒలింపిక్స్ (టోక్యో, పారిస్)లో టీమ్ఇండియా కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో హాకీ ఇండియా తరఫున శ్రీజేశ్కు బుధవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీజేశ్ తన కుటుంబ సభ్యులతోపాటు హాజరయ్యాడు. ఇక దాదాపు రెండు దశాబ్దాలకుపైగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీజేశ్, ఇప్పటివరకు 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఆటకు వీడ్కోలు పలికాడు. విశ్వ క్రీడలో ఆడిన తన సుదీర్ఘ కెరీర్లో ఆఖరి మ్యాచ్.
The stage is set to celebrate Sreejesh’s incredible achievements in hockey#IndiaKaGame #HockeyIndia
— Hockey India (@TheHockeyIndia) August 14, 2024
.
.
.
.@CMO_Odisha @IndiaSports @Media_SAI @sports_odisha @Limca_Official @CocaCola_Ind pic.twitter.com/bAEG8IiupW
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. దాదాపు 52ఏళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒలింపిక్ పతకాలు నెగ్గింది. టోక్యోకు ముందు చివరి సారిగా భారత్ మాస్కో (1980) ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అనంతరం హాకీలో భారత్ నాలుగు దశాబ్దాల పాటు పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఆ తర్వాత మళ్లీ టోక్యోలో(2021), 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి హాకీకి మళ్లీ ఊపిరి పోసినట్లైంది.
P.R. Sreejesh 🅼🅱️🅱️🆂
— Hockey India (@TheHockeyIndia) August 14, 2024
Miya
Biwi
Baccho
Samit#IndiaKaGame #HockeyIndia #SreejeshFelicitation #ThankYouSreejesh
.
.
.
.@CMO_Odisha @IndiaSports @Media_SAI @sports_odisha @Limca_Official @CocaCola_Ind pic.twitter.com/pjHGE3tTXx
హాకీకి గోల్ కీపర్ శ్రీజేశ్ గుడ్‌బై- పారిస్ ఒలింపిక్స్ లాస్ట్!
'హాకీ కోచ్ నా టార్గెట్- దానికి స్ఫూర్తి రాహుల్ ద్రవిడే ' - PR Sreejesh Hockey