ETV Bharat / sports

చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌ సంచలనం - మూడో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌పై విజయం!

భళా గుకేశ్! - చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మూడో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌పై విజయం!

Gukesh World Chess Championship 2024
Gukesh World Chess Championship 2024 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Gukesh World Chess Championship 2024 : ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆటగాడు చెన్నైకి చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ డి.గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు. ట్రోఫీ గెలుచుకునే లక్ష్యం దిశగా కీలక ముందడుగు వేశాడు. బుధవారం జరిగిన మూడో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు. చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌పై గుకేశ్‌ తొలిసారి విజయం సాధించాడు. ఈ గెలుపుతో కీలక మైలురాయి అందుకున్నాడు. ఛాంపియన్‌షిప్‌లో మూడు గేమ్‌ల తర్వాత ఇద్దరి స్కోరు 1.5 పాయింట్లతో సమయం అయింది.

తొలి గేమ్‌లో ఓడిపోయిన తర్వాత, గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. తెల్ల పావులతో ఆడుతూ డింగ్ లిరెన్‌కి టైమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎదురైన సమస్యలను సద్వినియోగం చేసుకున్నాడు. 13వ ఎత్తు వేసే సరికి గుకేశ్‌ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ఉపయోగించాడు. ఈ ఎత్తులకు లిరెన్ దాదాపు గంటకు పైగా సమయం తీసుకున్నాడు.

మ్యాచ్‌లో 120 నిమిషాల్లో 40 ఎత్తులు వేయాల్సి ఉంటుంది. ప్రారంభంలోనే డిండ్‌ చాలా సమయం తీసుకున్నాడు. దీంతో క్లిష్టమైన మిడిల్-గేమ్ పొజిషన్‌లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. గుకేశ్ వేగంగా, కచ్చితమైన ఎత్తులు వేస్తూ తన ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచాడు. చివరికి డింగ్ కేవలం రెండు నిమిషాల్లో తొమ్మిది ఎత్తులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో గుకేశ్​ మరింత వ్యూహాత్మక ఎత్తులతో ఇబ్బందులు సృష్టించాడు. డింగ్ తన 37వ ఎత్తులో సమయం మించిపోయాడు. దీంతో భారత గ్రాండ్‌మాస్టర్‌ విజయం అందుకున్నాడు.

గుకేశ్‌ స్పందన
గేమ్ అనంతరం గుకేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు."చాలా గొప్పగా అనిపిస్తోంది. గత రెండు రోజులుగా నేను ఆడిన ఆటపై సంతోషంగా ఉన్నాను. ఈరోజు నా ఆట మరింత మెరుగ్గా ఉంది. నేను బోర్డ్‌ వద్ద మంచి అనుభూతి పొందాను, నా ప్రత్యర్థిని ఓడింగలిగాను. ఇలాంటి విజయాలు సాధించడం ఎల్లప్పుడూ బాగుంటుంది." అని చెప్పాడు.

మెంటార్‌గా మాజీ ఛాంపియన్‌
ఐదుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్న విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాలని గుకేశ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. గుకేశ్‌కు ఆనంద్ మెంటార్‌గా ఉండటం గమనార్హం. చెస్ ప్రపంచంలో గుకేశ్‌కి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇక ఆటగాళ్లు తిరిగి గేమ్‌ ఆడే ముందు గురువారం విశ్రాంతి తీసుకుంటారు. గుకేశ్​ విజయం అతడి లక్ష్యానికి చేరువ చేయడమే కాకుండా, ఛాంపియన్‌షిప్‌లో బలమైన పోటీదారుగా నిలబెట్టింది.

'ఆ ఓటమి వల్లే ఇప్పుడు గెలిచాను' : ఫిడే క్యాండిడేట్స్ విజేత గుకేశ్ - Fide Candidates 2024 winner

'నా విజయంలో అతిపెద్ద కీలక పాత్ర ఆయనదే' - Fide Candidates 2024 Gukesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.