Gujarat Titans Retentions : ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకోబోతోందని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎవరిని రిటైన్ చేసుకోవాలనే దానిపై గుజరాత్ టైటాన్స్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
రిటెన్షన్ లిస్ట్ ఇదే!
గుజరాత్ రిటెన్షన్ లిస్ట్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రధానంగా ఉండనున్నట్లు సమాచారం. గిల్తోపాటుగా అఫ్గానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్‌ను కూడా అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఓ పోస్టులో గుజరాత్ టైటాన్స్ వీరిద్దరి ఫొటోలను షేర్ చేసింది. ప్రత్యర్థులందరూ శుభ్- రష్ కాంబోను ఇష్టపడతారని పోస్టులో రాసుకొచ్చింది. దీంతో ఈ ఇద్దర్నీ గుజరాత్ అట్టిపెట్టుకుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడతున్నారు. అలాగే ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Wanted to be rewarded for your opinions? 👀
— Gujarat Titans (@gujarat_titans) October 24, 2024
Head over to our app or website to let us know your picks and you could watch the Titans train live 🤩#AavaDe | #YourRetainedTitans pic.twitter.com/z10xVAuQCo
రాజస్థాన్ రిటెన్షన్ ప్లేయర్స్ వీళ్లే!
అలాగే రిటెన్షన్ చేసుకోబోయే ప్లేయర్ల విషయంలో రాజస్థాన్ రాయల్స్ ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ సంజూ శాంసన్‌తోపాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్, ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను అట్టిపెట్టుకోవాలని రాజస్థాన్ డిసైడ్ అయినట్లు ఫ్రాంఛైజీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిపై ఫ్రాంఛైజీ అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ద్వారా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎవరిని రూ.ఎన్ని కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంటుందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.
కాగా, టీమ్ఇండియాకు కోచ్‌గా టీ20 ప్రపంచ కప్ అందించిన రాహుల్ ద్రవిడ్ ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జట్టు కట్టాడు. వచ్చే సీజన్ నుంచి ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ గా పనిచేయనున్నాడు. దీంతో వచ్చే సీజన్‌లో రాజస్థాన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే జట్టులో భారీ మార్పులు చేయాలని ద్రవిడ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర, సీఈఓ జేక్ లష్ మెక్‌క్రమ్, డేటా అండ్ అనలిటిక్స్ డైరెక్టర్ గైల్స్ లిండ్సేతో కలిసి ఆటగాళ్ల రిటెన్షన్‌పై చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా ఐపీఎల్ 2024సీజన్ లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ మూడో ప్లేస్ లో నిలిచింది.
SRH రిటెన్షన్ లిస్ట్ రెడీ - ఆ ప్లేయర్ కోసం ఏకంగా రూ.23 కోట్లు!
కోహ్లీపై కొత్త రిటెన్షన్ రూల్స్ ప్రభావం ఎలా ఉంటుంది? - ఆర్సీబీ వ్యూహం ఏంటి?