ETV Bharat / sports

గుజరాత్ టైటాన్స్​లో బిగ్ ఛేంజ్- ఫ్రాంచైజీ నెక్ట్స్ ఓనర్ అదానీ! - Gujarat Titans Sale - GUJARAT TITANS SALE

Gujarat Titans Sale: గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్​ తమ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Gujarat Titans Sale
Gujarat Titans Sale (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 9:02 PM IST

Gujarat Titans Sale: గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ (CVC Capital) తమ ఫ్రాంచైజీ మెజారిటీ వాటాను వదులుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అదానీ గ్రూపు, టోరెంట్ గ్రూపు వాణిజ్య సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. చర్చలు సఫలమైతే సీవీసీ మెజారిటీ వాటాను విక్రయించనుంది.

2021లో ఫ్రాంచైజీ కొనుగోలు
2021లో రూ.5625 కోట్ల విలువైన గుజరాత్ టైటాన్స్‌ మెజారిటీ వాటాను సీవీసీ క్యాపిటల్​ కొనుగోలు చేసింది. దీంతో సీవీసీ క్యాపిటల్​ ఓనర్​షిప్​తోపాటు 4ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్​ (అగ్రిమెంట్)కూడా దక్కించుకుంది. అయితే ఈ లాక్ ఇన్ పీరియడ్​లో ఓనర్ ఫ్రాంచైజీని ఇతరులకు అమ్మలేడు. ఇతరులు ఫ్రాంచైజీని కొనలేరు. ఈ విధంగా బీసీసీఐ ఫ్రాంచైజీ ఓనర్లకు షరతులు విధించింది.

ముగుస్తున్న లాక్‌ ఇన్‌ పీరియడ్‌
అయితే గుజరాత్ ఫ్రాంచైజీ నాలుగేళ్ల లాక్- ఇన్ పీరియడ్‌ 2025 ఫిబ్రవరిలో ముగుస్తుంది. దీంతో సీవీసీ క్యాపిటల్ పార్టనర్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి ఎగ్జిట్‌ అయ్యే ఆలోచనలో ఉంది. ఈ మేరకు అదానీ, టొరెంటో గ్రూపు సంస్థలతో చర్చలు జరుపుతుంది. అయితే అదానీ, టొరెంట్ గ్రూపు రెండూ గుజరాత్​ ఫ్రాంచైజీపై గతంలోనే ఆసక్తి చూపాయి. వరుసగా రూ.5,100 కోట్లు, రూ.4,653 కోట్లకు వేలం వేశాయి.

Gujarat Titans IPL Journey: గుజరాత్ టైటాన్స్ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగు పెట్టగానే అదరగొట్టింది. 2022 మొదటి సీజన్‌లోనే హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో టైటిల్‌ గెలిచింది. మరుసటి సంవత్సరంలోను ఫైనల్​ చేరింది. అయితే 2023లో ఫైనల్​లో చెన్నై సూపర్​ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది.

2024లో ఫెయిల్: ఐపీఎల్ 2024కి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్​ను ముంబయి ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. దీంతో యాజమాన్యం ఆ బాధ్యతలు యంగ్ బ్యాటర్​ శుభ్‌మన్ గిల్‌కు అప్పజెప్పింది. కొత్త కెప్టెన్‌ నేతృత్వంలో గుజరాత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 2024లో పాయింట్స్‌ టేబుల్​లో ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఇప్పుడు ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025పై ఫోకస్‌ చేసింది. మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది.

గుజరాత్​తో మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్​కు హైదరాబాద్ - IPL 2024 GT VS SRH

గుజరాత్ కథ ముగిసింది - ఎవరివో ఆ మూడు బెర్తులు? - IPL 2024 PlayOffs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.