Gill Century vs England Test: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు సెంచరీ బాదాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. అతడు 131 బంతుల్లో శతకం బాదాడు. దీంతో టెస్టు కెరీర్లో గిల్ మూడో సెంచరీ నమోదు చేశాడు. 104 పరుగుల వద్ద క్యాచౌట్‌గా వెనుదరిగాడు. ఇక విశాఖపట్టణం టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.
ఓవర్‌నైట్ స్కోర్ 28-0తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (17) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. వీరిద్దర్నీ స్టార్ పేసర్ అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (29), రజత్ పటీదార్ (9) కూడా విఫలమయ్యారు. దీంతో 122 పరుగుకే టీమ్ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Shubman Gill Test Stats: అయితే శుభ్‌మన్ గిల్ కొన్ని రోజులుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. రీసెంట్గా ముగిసిన సౌతాఫ్రికా పర్యటన సహా చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో గిల్ ఒక్కసారి 50+ స్కోర్ చేయలేదు. అతడు చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 23, 10, 36, 26, 2, 29*, 10, 6, 18, 34 పరుగులు చేశాడు. ఇక వరుసగా విఫలమౌతున్న నేపథ్యంలో గిల్ మళ్లీ ఫామ్ అందుకొని శతకం నమోదు చేయడం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశమే.
-
𝙃𝙐𝙉𝘿𝙍𝙀𝘿 𝙛𝙤𝙧 𝙎𝙝𝙪𝙗𝙢𝙖𝙣 𝙂𝙞𝙡𝙡! 💯
— BCCI (@BCCI) February 4, 2024
A glittering knock as he completes his 3rd Test Century 👏👏
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/z33eaw2Pr5
Joe Root Injury: ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ గాయపడ్డాడు. ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రూట్, గిల్ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో అతడి వేలికి గాయమైంది. దీంతో రూట్ గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. ఇక రూట్ డైరెక్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్ టెస్టులో రూట్ బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ బంతితో రాణించాడు. తొలి టెస్టులో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు దక్కించుకున్నాడు.
బుమ్రా బౌలింగ్ దెబ్బ - బ్యాట్ కిందపడేసిన బెన్‌స్టోక్స్
యార్కర్ కింగ్ ఈజ్ బ్యాక్- 'బుమ్రా' బంతికి పోప్ క్లీన్‌బౌల్డ్- వీడియో చూశారా?