Gautam Gambhir World Cup : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా ఎమోషనలయ్యారు. 1992లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్ స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టడాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో తాను తీవ్రంగా ఏడ్చానంటూ గుర్తుచేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తనకు 11 ఏళ్ల వయసని, అప్పుడే తాను టీమ్ఇండియా ఓటమిని తట్టుకోలేక రాత్రంత ఏడ్చానంటూ తెలిపాడు. ఆ క్షణమే ఎలాగైనా టీమ్ఇండియాకు వరల్డ్ కప్ అందించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.
" బ్రిస్బన్ వేదికగా జరిగిన 1992 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అది చూసి నేను ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ నేను అంతలా ఏడ్చిన సందర్భాలు లేవు. నేను ఆ రోజు ఎందుకు అలా ఏడ్చానో కూడా తెలీదు. అప్పుడు నా వయసు కేవలం 11 ఏళ్లు మాత్రమే. అప్పుడే నేను భారత్ కోసం ప్రపంచకప్ గెలవాలని బలంగా ఫిక్స్ అయ్యా. ఆ కల 2011లో తీరింది.'అని గంభీర్ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 9 వికెట్లకు 237 పరుగులు చేసింది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతితో నిర్ణయించగా, 47 ఓవర్లలో 235 పరుగుల మాత్రమే చేయగలిగారు. అయితే భారత్ మాత్రం సరిగ్గా 234 పరుగులు చేసి ఓటమిపాలైంది.
తన క్రికెట్ కెరీర్లో గంభీర్ రెండు ప్రపంచకప్‌లు సాధించాడు. మాజీ కెప్టెన్ ధోనీ సారథ్యంలో జరిగిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకపుల్లో గంభీర్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఈ రెండు టోర్నీల్లోనూ గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ 97 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి - గంభీర్ పెట్టిన ఐదు కండీషన్లు ఇవే! - Team India Head Coach
హెడ్ కోచ్‌గా గంభీర్ ఫిక్స్? ఆ కండీషన్‌కు ఓకే చెప్తేనే! - Team India New Coach