ETV Bharat / sports

నేను బాగానే ఉన్నా- సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మకండి: వినోద్ కాంబ్లీ - Vinod Kambli Health Condition - VINOD KAMBLI HEALTH CONDITION

Former Indian cricketer Vinod Kambli Health Condition: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై కాంబ్లీ స్పందిచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నానని, సోషల్ మీడియా ప్రచారం నమ్మవద్దని చెప్పారు.

source  ANI
Former Indian cricketer Vinod Kambli Health Condition (source ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 5, 2024, 6:48 PM IST

Updated : Aug 9, 2024, 5:27 PM IST

Former Indian cricketer Vinod Kambli Health Condition: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆయన నడవలేని స్థితిలో ఉన్నారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వైరల్ వీడియో చూసిన ఆయన చిన్ననాటి మిత్రులు ఆందోళన చెంది గురువారం వినోద్ ఇంటికెళ్లారు. అయితే వినోద్ కాంబ్లీ దీనిపై స్పందిచారు. అందతా అబద్దపు ప్రచారం అని స్నేహితులతో చెప్పారు. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నానని సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మోద్దని కాంబ్లీ అన్నారు.

అయితే భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై ఆందోళన కలిగించే వీడియో ఒకటి ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ తెందూల్కర్‌ చిన్ననాటి స్నేహితుడైన కాంబ్లీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఈ వైరల్‌ వీడియోలో కాంబ్లీ నడవడానికి కూడా ఇతరులపై ఆధారపడటం కనిపించింది.

వీడియోలో, వినోద్​ కాంబ్లీ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టంగా కనపడుతోంది. ఈ వీడియోను నరేంద్ర గుప్తా అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ అప్‌లోడ్‌ చేశాడు. ఆయన ఓ పోస్ట్‌లో కాంబ్లీ పరిస్థితిని వివరించారు. ‘మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం సరిగా లేదు. కాంబ్లీ ఇటీవలే తన ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఆయన గుండె సమస్యలు, డిప్రెషన్‌ సహా అనేక ఆరోగ్య సమస్యలతో చాలాసార్లు ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకుంటారని, ఆయనకు అవసరమైన సపోర్ట్‌ లభిస్తుందని ఆశిస్తున్నాను!’ అని పేర్కొన్నారు.

2013లో గుండెపోటు
వినోద్ కాంబ్లీ చాలా సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. 2013లో గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం, అతడు మరోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

వినోద్ కాంబ్లీ కెరీర్‌
వినోద్ కాంబ్లీ క్రికెట్‌లో తక్కువ కాలమే కొనసాగినా, అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కాంబ్లీ 1993 ఫిబ్రవరి 2న ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. భారతదేశం తరఫున మొత్తం 17 టెస్టులు ఆడాడు, 1084 పరుగులు చేశాడు. అలానే 104 వన్డేల్లో 32.59 యావరేజ్‌తో 2477 పరుగులు సాధించాడు. అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్ అద్భుతంగా రాణించాడు. 129 మ్యాచుల్లో 59.67 యావరేజ్‌తో ఏకంగా 9965 పరుగులు చేశాడు.

సచిన్‌- కాంబ్లీ ప్రపంచ రికార్డు
వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ తెందూల్కర్‌తో కలిసి స్కూల్ మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు 664 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ సమయంలో కాంబ్లీ వయసు 17, తెందూల్కర్‌ వయసు 16.

2000లో చివరి వన్డే
వినోద్ కాంబ్లీ తరచూ వివాదాల్లో చిక్కుకునేవాడు. క్రమశిక్షణ రాహిత్య చర్యలు ఎదుర్కొనేవాడు. భారత జట్టులో ఎప్పుడూ స్థిరంగా లేడు. 2000లో చివరి వన్డే ఆడిన అతడు ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు సంపాదించలేదు. కాంబ్లీ 2009లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో దేశవాళీ క్రికెట్ నుంచి వైదొలిగాడు.

'రిస్క్ చేయడానికి భయపడను- ఆ విషయంలో తగ్గేదేలే' - Rohit Sharma

డెబ్యూ మ్యాచ్​లో ఫెయిల్- వన్ ఇయర్ బ్యాన్- ఇప్పుడు ఒక్క నైట్​లో సెన్సేషన్ - Ind vs SL Series 2024

Last Updated : Aug 9, 2024, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.