ETV Bharat / sports

అన్​క్యాప్డ్ ప్లేయర్లుగా ఇంటర్నేషనల్ క్రికెటర్లు - ధోనీతోపాటు బరిలో దిగేది వీళ్లే! - IPL Retentions 2025 - IPL RETENTIONS 2025

Ms Dhoni IPL Retention : 2025 ఐపీఎల్​ రిటెన్షన్ నిబంధనలను పాలక వర్గం ఫైనలైజ్ చేసింది. కొత్త నిబంధన ప్రకారం లెజెండరీ ప్లేయర్ ధోనీ అన్​క్యాప్డ్ ప్లేయర్​గా బరిలోదిగే ఛాన్స్ ఉంది. ధోనీతో పాటు పలువురు సీనియర్ ప్లేయర్లు కూడా అన్​క్యాప్డ్ ప్లేయర్ కోటాలో బరిలో దిగే అవకాశం ఉంది. వాళ్లేవరంటే?

Ms Dhoni IPL Retention
Ms Dhoni IPL Retention (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 29, 2024, 6:05 PM IST

Ms Dhoni IPL Retention : 2025 ఐపీఎల్‌ మెగా వేలానికి సంబంధించి నిబంధనలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శనివారం విడుదల చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు టీమ్​లోని ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి అనుమతినిచ్చింది. ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (RTM) కలిసి ఉంటుందని పేర్కొంది. ఇక కొత్త నిబంధనల ప్రకారం క్యాప్డ్ ప్లేయర్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా ఆడటానికి అవకాశం కల్పించింది. ఇలా అన్​క్యాప్డ్ ప్లేయర్లుగా వేలంలోకి వస్తే వాళ్ల కనీస ధర రూ. కోటి కంటే తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు ఎమ్ఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అన్​క్యాప్డ్​ ప్లేయర్​గా RTM ద్వారా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.

అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్ ఏంటి?
గత ఐదేళ్లుగా ఐపీఎల్ ఆడుతూ, ఆ సమయంలో టీమ్ఇండియాకు ఆడని బీసీసీఐ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లను అన్ క్యాప్డ్ ప్లేయర్స్​గా పరిగణిస్తారు. ఈ రూల్ టీమ్ఇండియా ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్ నియమం ఐపీఎల్​లో మొదటి నుంచి ఉంది. కానీ ఏ ప్రాంచైజీ దీనిని ఉపయోగించలేదు. దాంతో 2021లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ నియమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

అన్​క్యాప్డ్ ప్లేయర్స్​గా బరిలోకి!

  1. ఎంఎస్ ధోనీ : ఐపీఎల్ ప్రారంభం నుంచి ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సీఎస్కేను ధోనీ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్​గా నిలిపాడు. అయితే ధోని చివరిసారిగా 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో టీమ్ఇండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. అంటే ధోనీని భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్ కొత్త నిబంధనల ప్రకారం, ఎంఎస్ ధోనీని సీఎస్కే అన్‌ క్యాప్డ్ ప్లేయర్​గా రిటైన్ చేసుకోవచ్చు.
  2. మోహిత్ శర్మ : టీమ్ఇండియా పేసర్ మోహిత్ శర్మ ఐపీఎల్ సీజన్ 2023లో గుజరాత్ టైటాన్స్‌ తరఫున ఆడాడు. ఆ సీజన్​లో డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి టీమ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా మోహిత్ వేసిన స్లో బంతులకు బ్యాటర్ల పెద్ద షాట్లను ఆడేందుకు ఇబ్బందిపడ్డారు. హరియాణాకు చెందిన ఈ పేసర్ చివరిసారిగా 2015లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత టీమ్ఇండియా జెర్సీ ధరించలేదు.
  3. సందీప్ శర్మ : ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఐపీఎల్​లో గత కొన్నేళ్లుగా కీలకంగా రాణిస్తున్నాడు. కొత్త బంతిని స్వింగ్‌ చేసి ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సందీప్ శర్మ అదరగొట్టాడు. ఈ ప్లేయర్ కూడా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటింది. దీంతో రాజస్థాన్ సందీప్​ను అన్ క్యాప్డ్ ప్లేయర్​గా తీసుకునే అవకాశం ఉంది.
  4. పీయూశ్ చావ్లా : టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా గత రెండు ఐపీఎల్ సీజన్లలో ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే టీమ్ఇండియా తరఫున పీయూశ్ 2012లో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇతడు కూడా అన్ క్యాప్డ్ ప్లేయర్ బరిలో దిగే అవకాశం ఉంది.
  5. విజయ్ శంకర్ : ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గుజరాత్ టైటాన్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019లో టీమ్ఇండియా తరఫున విజయ్ శంకర్ చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడికి టీమ్ఇండియాలో చోటు దక్కలేదు. దాదాపుగా విజయ్ శంకర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి 5ఏళ్లు దాటింది. దీంతో అతడిని గుజరాత్ అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ కింద ఉంచుకోవాలని భావిస్తోంది.

క్రికెటర్లకు BCCI బంపర్ ఆఫర్- ఇకపై మ్యాచ్ ఫీజు రూ. 7.5 లక్షలు- కంప్లీట్ సీజన్​కు కోటిపైనే! - IPL 2025 Match Fee

ఐపీఎల్ నయా రూల్స్​కు బీసీసీఐ గ్రీన్​ సిగ్నల్ - రిటెన్షన్​లో ఆరుగురిని అట్టిపెట్టుకునే ఛాన్స్ - IPL 2025 Retention Rules

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.