Somerset vs Surrey 2024: ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో అరుదైన ఫీట్ నమోదైంది. ఓకే ఫ్రేమ్‌లో 13 మంది ప్లేయర్లు కనిపించారు. అయితే ఒక్కో జట్టులో 11 మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. అలాంటింది 13 మంది ప్లేయర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. అసలేం జరిగిందంటే?
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సోమర్సెట్- సర్రే టీమ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 219 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు దిగిన సర్రే జట్టు 109/9 స్కోరు వద్ద నిలిచింది. ఇక మ్యాచ్ ఆఖరిరోజు మరో 3 నిమిషాల్లో ఆట ముగియాల్సి ఉంది. దీంతో వికెట్ కాపాడుకొని మ్యాచ్‌ను డ్రా గా ముగించుకోవాలని సర్రే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో సోమర్సెట్ మంచి ప్లాన్ వేసింది. ఎలాగైన ఆఖరి వికెట్ తీసి మ్యాచ్‌లో విజేతగా నిలవాలని బౌలర్, వికెట్ కీపర్ కాకుండా మిగతా ఫీల్డర్లందరినీ (9 మంది) బ్యాటర్‌కు పక్కనే ఫీల్డింగ్ సెట్ చేసింది. ఇక లీచ్ వేసిన ఆ బంతిని బ్యాటర్ డేనియల్ వార్రల్ అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు.
కానీ, బంతి నేరుగా బ్యాటర్ ప్యాడ్లను తాకింది. వెంటనే అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో సర్రే 109 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సోమర్సెట్ 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఇద్దరు బ్యాటర్లతో కలిపి సోమర్సెట్ టీమ్‌లోని 11 మంది ప్లేయర్లూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❤️ Cricket ❤️#SOMvSUR#WeAreSomerset pic.twitter.com/S7IrAEMezz
— Somerset Cricket (@SomersetCCC) September 12, 2024
ఇక మ్యాచ్విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. తర్వాత సర్రే కూడా అద్భుతంగా ఆడింది. 321 పరుగులు చేసి నాలుగు పరుగులు లీడ్‌లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో సోమర్సెట్ను 224 పరుగులకు ఆలౌట్ చేసిన సర్రే లక్ష్య ఛేదనలో మాత్రం తడబడింది.
సంక్షిప్త స్కోర్లు
- సోమర్సెట్ : 317-10, 224-10
- సర్రే : 321-10, 109-10
ధోనీ స్టైల్లో వికెట్ కీపింగ్ - అదరగొట్టిన సంజూ! - Sanju Samson Rajasthan Royals