Dhoni CSK Retirement : 2025 ఐపీఎల్ సీజన్‌కు మరి కొన్ని నెలల్లో సన్నాహకాలు మొదలవుతుందన్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీని బట్టి ఆ జట్టు ప్లేయర్ ఎంఎస్ ధోనీ రానున్న సీజన్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ఇంతకీ ఏమైందంటే?
మేజర్ మిస్సింగ్
చెన్నై ఫ్రాంచీజీ తాజాగా సోషల్ మీడియాలో 'మేజర్ మిస్సింగ్' అనే క్యాప్షన్‌తో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ధోనీ నంబర్ 7 జెర్సీని కూడా పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో గందరగోళం సృష్టించింది. దీంతో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Major Missing 🥹💛#WhistlePodu #Yellove pic.twitter.com/y2dlSAmKs8
— Chennai Super Kings (@ChennaiIPL) September 11, 2024
అయితే ధోనీ కోసం చెన్నై ఫ్రాంచైజీ ఇప్పుడు ఓ పాత రూల్‌ను మళ్లీ అమలు చేయాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. అదేంటంటే ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాళ్లను అనామక ఆటగాళ్లుగా పరిగణించేవాళ్లు. ఈ రూల్ 2018 వరకు అమలులోనే ఉండేది. అయితే ఇప్పుడు ఈ రూల్‌ను ధోనీ కోసం తీసుకుని రావాలని సీఎస్‌కే డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇతర ఫ్రాంచైజీల నుంచి వ్యతిరేకం వస్తోంది.
ఇదిలా ఉండగా, గతంలో కీళ్ల నొప్పుల కారణంగా ధోనీ కెప్టెన్సీ అలాగే తన బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా మార్చుకున్న సంగతి తెలిసిందే. కేవలం వికెట్ కీపింగ్‌పైనే దృష్టి పెట్టి అప్పుడప్పుడు బ్యాట్ పట్టుకుని కనిపించేవాడు. దీంతో రానున్న సీజన్ కోసం ధోనీ తమ వైద్యుల సలహా తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాడని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ధోనీ పరిస్థితి చూస్తుంటే ఈ మాట కూడా నిజమయ్యేలా లేదని తెలుస్తున్నట్లు క్రికెట్ వర్గాల మాట.
ఇక ధోనీ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ స్టార్ ప్లేయర్ 234 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 4,669 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ఓవరాల్‌గా అతడు 264 మ్యాచ్‌ల్లో 5,243 పరుగులు తీసి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.