ETV Bharat / sports

ఉప్పల్ స్టేడియంలో రూ. 4,500 సీట్ మిస్​ - రీఫండ్ డిమాండ్ చేసిన చెన్నై అభిమాని! - CSK VS SRH Match Fan - CSK VS SRH MATCH FAN

CSK VS SRH Match Fan : హైదరబాద్​లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం చెన్నై, సన్​రైజర్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు ఓ అభిమాని. దీంతో ఆ వ్యక్తి తనకు రీఫండ్ కావాలని కోరారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

CSK VS SRH Match Fan
CSK VS SRH Match Fan
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 1:14 PM IST

Updated : Apr 6, 2024, 7:04 PM IST

CSK VS SRH Match Fan : ఐపీఎల్ 17లో భాగంగా శుక్రవారం హైదరబాద్​లోని ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్​రైజర్స్ హైదరబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరును వీక్షించేందుకు అటు ఆరెంజ్ ఆర్మీతో పాటు ధోనీ సేన కూడా స్టేడియానికి బారులు తీరారు. దీంతో మ్యాచ్​కు ముందు కాస్త ఉద్రిక్తత నెలకొంది. అయితే కాసేపటి తర్వాత అంతా సద్దుమణిగి స్టాండ్స్​లోకి వెళ్లిపోయారు. తమ తమ సీట్స్​లో కూర్చుని తమ ఫేవరేట్ ప్లేయర్లను చీర్ చేయడం మొదలెట్టారు. అయితే ఆ తర్వాత ఓ అభిమానికి స్టాండ్స్​లో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. టికెట్ బుక్కింగ్ యాప్​ను రీఫండ్​ కోరారు.

ఇంతకీ ఏం జరిగిందంటే ?
జునైద్ అహ్మద్ అనే వ్యక్తి చెన్నై సూపర్ కింగ్స్​కు వీరాభిమని. ఇక తన ఫేవరట్ టీమ్​ను సపోర్ట్ చేసేందుకు ఉప్పల్ స్టేడియానికి టికెట్ బుక్ చేశారు. రూ. 4,500 టికెట్​ను ఆయన కొనుగోలు చేశారు. తీరా స్టాండ్స్​లోకి వెళ్లేసరికి తనకు కేటాయించిన J 66 సీట్​ కనిపించలేదు. దీంతో ఆయన చాలా సేపు నిల్చోవాల్సి వచ్చిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. తనకు రీఫండ్ కావాలని డిమాండ్ చేశారు. అయితే ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత ఆ సీట్ కోసం వెతకగా, అది 'J' రో లోని 69-70 సీట్ల పక్కన కనిపించింది. దీంతో జునైద్ వాపోయారు. ఇలా జరుగుతుందని అస్సలు ఉహించలేదంటూ పేర్కొన్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, సొంత గడ్డపై సన్​రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయింది. ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్​ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఎయిడెన్ మర్​క్రమ్ (50), అభిషేక్ శర్మ (37), ట్రావిస్ హెడ్ (31) రాణించారు. దీంతో సన్​రైజర్స్ ప్రస్తుత సీజన్​లో రెండో విజయాన్ని అందుకుంది.

జోరుమీదున్న సన్​రైజర్స్​కు షాక్- టోర్నీ మొత్తానికి హసరంగ దూరం! - Wanindu Hasaranga IPL 2024

అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్​ - చెన్నైని ఉతికారేశాడు - IPL 2024 CSK VS SRH

Last Updated : Apr 6, 2024, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.