CSK VS DC IPL 2024 : ఈ ఏడాది ఐపీఎల్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో అభిమానులకు కిక్కెచ్చింది. ఒక జట్టు గెలుస్తుందనుకుంటున్న తరుణంలో మరో జట్టు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన ఘటనలు ఉన్నాయి. ఇవే కాకుండా పలు బెస్ట్ మూమెంట్స్ కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌ల కోసం విశాఖపట్నాన్ని దిల్లీ తమ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఐదేళ్ల తర్వాత వైజాగ్‌లో ఐపీఎల్ సందడి చూడనున్నాం. ఆదివారం రాత్రి ఈ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత మరో మ్యాచ్ బుధవారం దిల్లీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది. 2012, 2015, 2016, 2019 ఇలా నాలుగు సీజన్లలో విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. చివరి మ్యాచ్ కూడా దిల్లీ, చెన్నై (2019లో రెండో క్వాలిఫయర్) మధ్యే జరిగింది.
ఇప్పుడు ఈ రెండు జట్ల పోరులో సీఎస్కేనే ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు గెలుపొందగా, దిల్లీ జట్టు మాత్రం ఓటమిని చవి చూసింది. పైగా సీఎస్కేతో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ దిల్లీ ఓడింది.
చెన్నై జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌లో శివమ్ దూబె, రచిన్ రవీంద్ర నిలకడగా రాణిస్తుండగా, ఇటు బౌలింగ్‌లో ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ అయిన ధోని కోసం అభిమానులు స్టేడియానికి పోటెత్తే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పటికే వరుస ఓటములు చూస్తున్న దిల్లీ జట్టు కూడా రానున్న మ్యాచుల్లో మంచి ఫామ్ కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది. గాయల నుంచి కోలుకున్న రిషబ్ పంత్ ఇంకా ఫామ్‌లోకి వచ్చినట్లు అనిపించట్లేదు.ఆ జట్టులో ఆంధ్ర రంజీ కెప్టెన్ రికీ భుయ్ కూడా ఉన్నాడు. కానీ పృథ్వీ షాను ఆడించాలనుకుంటే మాత్రం అతను పెవిలియన్‌కు పరిమితమవొచ్చు.
దుకుడుగా హైదరబాద్ - గుజరాత్ కూడా
ఇక ఇటీవలే జరిగిన సూపర్ ఇన్నింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రేంజ్‌నే మార్చేసింది. ఆ ఒక్క మ్యాచ్‌లో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో మామూలుగా ఉండదంటూ చెప్పకనే చెప్పింది. ముంబయి లాంటి టాప్ జట్టుపై సన్‌రైజర్స్ ప్లేయర్లు విరుచుకుపడ్డారు. ఫోర్లు సిక్సర్లు బాది ఐపీఎల్ హిస్టరీలోనే అత్యథిక స్కోర్ (277) సాధించి చరిత్రకెక్కారు. ఇప్పుడు అదే దూకుడుతో గుజరాత్ టైటాన్స్‌పై నా కూడా తమ సత్తా చాటేందుకు బరిలోకి దిగుతున్నారు.
దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆరంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్, సన్‌రైజర్స్ ఉత్కంఠ పోరు జరగనుంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో రెండేసి మ్యాచ్‌లాడిన ఈ రెండు జట్లూ, చెరొక్క విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి. దుకుడైన బ్యాటింగ్ లైనప్‌తో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్‌తో పాటు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఏడన్ మార్‌క్రమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
లఖ్‌నవూతో మ్యాచ్ - అతడే మా కొంపముంచాడు : ధావన్ - IPL 2024 LSG VS Punjab Kings
మయాంక్ మెరుపు వేగంతో లఖ్‌నవూ బోణీ - పంజాబ్ ఓటమి - LSG VS PBKS IPL 2024