Cricketers Marry Sports Anchors: పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో నిర్ణయిస్తారని ఏదో ఒక పాత సామెత ఉంది. కానీ, కొందరు క్రికెటర్లకు మాత్రం పెళ్లిళ్లు క్రికెట్ గ్రౌండ్లే నిర్దేశిస్తాయి. టీ20 వరల్డ్‌కప్ 2024 టైటిల్‌ను భారత్‌కు తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర వహించిన బుమ్రాది కూడా ఇదే కథ. సంజనా గణేశన్ అనే స్పోర్ట్స్ యాంకర్‌తో పరిచయం అది ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. మరి ఈ లిస్ట్‌లో ఇంకా ఎవరెవరున్నారో తెలుసా?
బుమ్రా- సంజనా: టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పోర్ట్స్ యాంకర్ సంజనతో తొమ్మిదేళ్ల డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నాడు. 2013లో సంజనా పరిచయం కాగా, 2019లో లవ్ ప్రపోజల్‌తో ప్రేమ పక్షులు అయ్యారట. ఆ తర్వాత 2021న గోవాలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అంగద్ అనే కొడుకు కూడా ఉన్నాడు.
షేన్ వాట్సన్- లీ ఫర్లంగ్: ఆస్ట్రేలియా జట్టు ఆల్ రౌండర్, సీఎస్కే మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ కూడా యాంకర్‌నే వివాహం చేసుకున్నాడు. 2006లో స్పోర్ట్స్ ఛానెల్ యాంకర్ లీ ఫర్లంగ్‌ను తొలిసారి కలిశాడు. అలా పలుమార్లు కలిసిన వాళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి విలియమ్, మటిల్డా విక్టోరియా వాట్సన్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
స్టువర్ట్ బిన్ని- మయాంతి లాంగర్: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీది కూడా లవ్ మ్యారేజే. 2008లో స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ మయంతీ లాంగర్‌ను కలిశాడు. ఆ తర్వాత వారి బంధం ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. ఆ సమయంలో బిన్నీ హైదరాబాద్ హీరోస్ జట్టుకు ఆడుతున్నాడట. 2012లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు 2020లో కొడుకు పుట్టాడు.
బెన్ కటింగ్- ఎరిన్ హోలాండ్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ తన భార్య ఎరిన్ హోలాండ్ ఓ స్టోర్ట్స్ ఛానెల్‌కు యాంకర్‌గా ఉన్న సమయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎరిన్ హోలాండ్ 2013 మిస్ వరల్డ్ ఆస్ట్రేలియాగా ఎంపికైంది. యాంకరింగ్‌తోపాటు ఛారిటీ వర్కర్, మోడల్, డ్యాన్సర్, సింగర్‌గా పలు ప్రొఫెషన్స్‌లో ఆమె రాణిస్తోంది. తన భర్త బెన్ కటింగ్‌ను తొలిసారి కలుసుకున్న సందర్భం గురించి ఎరిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. 'నా భర్త బెన్ కటింగ్‌ను 2014లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలిశాను. అలా ఛాటింగ్ చేసుకుంటూ త్వరగానే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. 2015లో డేటింగ్‌తో మొదలైన మా ప్రయాణం 2019 ఫిబ్రవరిలో వివాహం వరకూ వెళ్లింది' అని తమ లవ్ స్టోరీ గురించి వివరించింది ఎరిన్.
మార్టిన్ గప్తిల్- లారా మెక్‌గోల్డ్‌రిక్: 'ద క్రికెట్ షో' అనే ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలో కివీస్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్- లారా మెక్‌గోల్డ్‌రిక్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు హార్లీ, థియేడోర్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2019లో బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ అనంతరం కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌ను లారా మెక్‌గోల్డ్‌రిక్ ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.