Bumrah Wife Sanjana Ganesan Net Worth : భారత్ టీ20 ప్రపంచ కప్ 2024ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలింగ్ దళంలో కీలకంగా వ్యవహరిస్తూ అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. ఎలాంటి దశలో అయినా ఒత్తిడి లేకుండా వికెట్లు అలవోకగా తీస్తూ జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఆటలో సీరియస్‌గా ఉండే ఈ స్టార్ తన సతీమణి కనిపిస్తే మిస్టర్ కూల్ అయిపోతాడు. వరల్డ్ కప్ ఆద్యంతం ఈ జంట మైదానంలో అలరించి అందరి దృష్టిని ఆకర్షించింది. స్వతహాగా క్రికెటర్ అయిన బుమ్రా, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్ లవ్ జర్నీ ఎలా మొదలైందంటే?
గోల్డ్ మెడలిస్ట్ - మిస్ ఇండియా కంటెస్టెంట్- సంజనా కెరీర్ టర్నింగ్ పాయింట్ అదే!
పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీ.టెక్ చేశారు సంజనా గణేశన్. ఈమె ఆ ఫీల్డ్‌లో గోల్డ్ మెడల్ సైతం సాధించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఓ IT సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2012లో సంజనా 'ఫెమినా స్టైల్ దివా'లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏడాదే 'ఫెమినా మిస్ ఇండియా'గా ఎన్నికయ్యారు.
2014లో సంజనా గణేశన్ ప్రముఖ హిందీ ఛానెల్ నిర్వహించిన Splitsvilla అనే రియాల్టీ షో లో కంటెస్టెంట్‌గానూ ఉన్నారు. అయితే గాయం కారణంగా సగంలోనే ఆ ప్రోగ్రామ్ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలోనే ఆమె స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా మారారు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్‌లో టీవీ ప్రెజెంటర్‌గా పనిచేశారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక అప్పటి నుంచి ఐపీఎల్, బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఇలా వివిధ క్రీడా కార్యక్రమాలకు ప్రజెంటేటర్‌గా పనిచేశారు. ప్రముఖులతో స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. అప్పుడే బుమ్రాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమ, ఆపై పెళ్లికి దారితీసింది. 2021లో బుమ్రా, సంజనా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరికీ అంగద్ అనే కుమారుడు ఉన్నాడు.
ట్రేడ్ వర్గాల సమచారం ప్రకారం, సంజనా గణేశన్ నికర ఆస్తుల విలువ రూ. 8 కోట్లు. ఒక్కో టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఆమె రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారని టాక్.
అహ్మదబాద్‌లో విల్లా - రూ.2 కోట్ల లగ్జరీ కార్
ఇక జస్ప్రీత్ బుమ్రా దంపతులు అహ్మదాబాద్‌లో సుమారు రూ.2 కోట్ల విలువగల ఓ అందమైన భవనంలో నివసిస్తున్నారు. దీన్ని బుమ్రా 2021లో కొనుగోలు చేశాడు. ఇది కాకుండా ఈ జంటకు ముంబయిలో దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉంది.
ఇక కార్ల కలెక్షన్ విషయానికి వస్తే, మెర్సిడీస్-మేబ్యాక్ (రూ. 2.3 కోట్లు), నిస్సాన్ జిటి-ఆర్ (దాదాపు రూ. 2 కోట్లు), రేంజ్ రోవర్ వెలార్ (దాదాపు రూ. 87 లక్షల ధర), టయోటా ఇన్నోవా క్రిస్టా (విలువ రూ. 19 లక్షలు). ఇలా పలు హై-ఎండ్ కార్లు వీరి గ్యారేజ్‌లో ఉంది.
యాంకర్లతో క్రికెటర్ల లవ్‌స్టోరీలు- ఈ జోడీలు సూపర్ హిట్ బాస్! - Cricketers Marry Sports Anchors
బాడీషేమింగ్ - ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బుమ్రా భార్య