Team India Future Superstars: భారత క్రికెట్ జట్టులో ప్రతి జనరేషన్‌కు ఆయా ఆటగాళ్లు సూపర్ స్టార్లుగా కొనసాగారు. గతంలో సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ తదితరులు టీమ్ఇండియాకు ప్రతిష్ఠాత్మక విజయాలు అందించారు. ఇక గత దశాబ్ద కాలంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో బ్యాట్‌తో అదరగొట్టి విజయాలు అందిస్తున్నారు.
అయితే ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరూ, రానున్న రెండేళ్లలో మిగిలిన ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఫ్యూచర్ స్టార్లు ఎవరు అనే ప్రశ్న పదేపదే ఉత్పన్నమవుతోంది. అయితే ఇదే ప్రశ్న రీసెంట్గా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎదురైంది. కానీ, వాళ్లు ఎక్కువగా ఆలోచించకుండా యంగ్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ పేర్లను ఎంచుకున్నారు.
Jaiswal & Gill தான் #TeamIndia-வின் அடுத்த Super Stars - Australian Players👏 #BorderGavaskarTrophy #ToughestRivalry #BGTOnStar pic.twitter.com/o4I7FoES3M
— Star Sports Tamil (@StarSportsTamil) September 15, 2024
అందులో స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, కేమరూన్ గ్రీన్ శుభ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపగా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్ యశస్వి జైశ్వాల్‌కు ఓటు వేశారు. 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గిల్ తన ఖాతాలో ఇప్పటికే వన్డే డబుల్ సెంచరీ వేసుకోగా, గతేడాది టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన జైశ్వాల్ 9 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 2 ద్విశతకాలు సాధించాడు.
ఇక ఈ ఇద్దరు ప్రస్తుతం బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సిద్ధం అవుతున్నారు. తొలి టెస్టు సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చెన్నై చేరుకున్న గిల్, జైశ్వాల్ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు.
బంగ్లాతో తొలి టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
టీమ్ఇండియా మాస్టర్ ప్లాన్- బంగ్లాకు ఇక కష్టమే! - Ind vs Ban Series 2024
జైశ్వాల్ బెస్ట్ ప్లేస్- దూసుకొచ్చిన గిల్- T20 ర్యాంకింగ్స్ రిలీజ్