Ashwin Jadeja Partnership : భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 339-6 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్ (102*), జడేజా (86*) ఉన్నారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాని ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు అజేయంగా 195* పరుగులు జోడించారు. ఈ క్రమంలో చాలా రికార్డులు బద్దలుకొట్టారు.
24 ఏళ్ల రికార్డు బ్రేక్
ఈ భారీ భాగస్వామ్యంతో అశ్విన్, జడేజా 24ఏళ్ల రికార్డు బ్రేక్ చేశారు. అశ్విన్, జడ్డూ ద్వయం టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై 7వ వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జంటగా నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు గంగూలీ- సునీల్ జోషి (121 పరుగులు) జోడీ పేరిట ఉంది. వీరిద్దరూ 2000 నవంబర్‌లో ఢాకాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ స్కోరు సాధించారు. కాగా, తాజాగా అశ్విన్- జడేజా జోడీ ఈ రికార్డును బద్దలుకొట్టింది.
చెన్నైలోనూ ఇదే టాప్
అదే సమయంలో అశ్విన్ - జడేజా జోడీ చెన్నైలో జరిగిన టెస్టుల్లో అత్యధిక ఏడో వికెట్ పార్ట్‌నర్‌షిప్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇంతకు ముందు ఈ రికార్డు జడేజా- కరుణ నాయర్‌పై ఉంది. 2016లో ఈ జోడీ ఇంగ్లాండ్‌పై ఏడో వికెట్‌కి 138 పరుగులు జోడించారు.
ఎలైట్ క్లబ్‌లో అశ్విన్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో 100 వికెట్లు, 1,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. ఈ రికార్డు అందుకున్న మొదటి ఆటగాడు జడేజా కావడం గమనార్హం.
A stellar TON when the going got tough!
— BCCI (@BCCI) September 19, 2024
A round of applause for Chennai's very own - @ashwinravi99 👏👏
LIVE - https://t.co/jV4wK7BgV2 #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/j2HcyA6HAu
పంత్ స్ఫూర్తి
అద్భుత సెంచరీ సాధించిన అశ్విన్, తాను రిషబ్ పంత్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పాడు. 'ఈ ప్రేక్షకుల ముందు ఆడటం ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. నాకు ఇక్కడ చాలా సంతోషకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇక్కడ టెస్టుల్లో చివరి వంద సాధించినప్పుడు, మీరు జట్టు కోచ్ రవి భాయ్. నేను T20 టోర్నమెంట్ (తమిళనాడు ప్రీమియర్ లీగ్) ఆడిన తర్వాత టెస్టుకి వచ్చాను. అది సహాయం చేస్తుంది. నేను నా బ్యాటింగ్‌ని చాలా మెరుగుపరుచుకున్నాను. రిషబ్ పంత్‌లాగ బలంగా బంతిని కొట్టాలని అనుకుంటున్నాను' అని అశ్విన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.
జడ్డూ వల్లే సాధ్యం!
'టెస్టుల్లో అత్యుత్తమ ఆటగాళ్లలో జడేజా ఒకడు. అతడు చాలా హెల్ప్ చేశాడు. ఓ దశలో నేను చెమటలు కక్కుతూ కష్టపడుతున్నాను. అతడు దాన్ని గమనించి నన్ను ముందుకు తీసుకెళ్లాడు. వికెట్ ఎలా స్పందిస్తుందో కనిపెట్టాడు, పటిష్టంగా ఆడాడు. సింగిల్స్‌ను టూడీలుగా మార్చేందుకు జడ్డూ సహకరించాడు. అది నాకు నిజంగా ఉపయోగపడింది' అని జడేజా సహకారం గురించి చెప్పాడు.
1️⃣5️⃣0️⃣-run partnership between @ashwinravi99 and @imjadeja and it takes #TeamIndia past the 3️⃣0️⃣0️⃣-run mark. 💪💪 #TeamIndia https://t.co/jV4wK7BOKA… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/G6gZ7kmlAQ
— BCCI (@BCCI) September 19, 2024
అశ్విన్ అదరహో - సెంచరీతో బంగ్లా బౌలర్లకు చెక్ - Ind vs Ban Test Series 2024