ETV Bharat / sports

వికెట్ నెం.500- టెస్టుల్లో 'అశ్విన్' ఘనమైన రికార్డ్ - Test wickets list

Ashwin 500 Wickets Test: స్టార్ ఆల్​రౌండర్ అశ్విన్ ఘనమైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి అందుకున్నాడు.

Ashwin 500 Wickets Test
Ashwin 500 Wickets Test
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 3:03 PM IST

Updated : Feb 16, 2024, 4:25 PM IST

Ashwin 500 Wickets Test: టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన తొమ్మిదో బౌలర్​గా నిలిచాడు. రాజ్​కోట్ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో జాక్ క్రాలీ (15) వికెట్ తీసిన అశ్విన్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ లిస్ట్​లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మరళీధరణ్ 800 వికెట్లతో టాప్​లో ఉన్నాడు. భారత్ నుంచి అనిల్ కుంబ్లే (619 వికెట్లు) ఒక్కడే ఆశ్విన్ కంటే ముందున్నాడు. ఇక 98 టెస్టు మ్యాచ్​లు ఆడిన అశ్విన్ బ్యాటింగ్​లోనూ మంచి గణాంకాలు నమోదు చేశాడు. 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సహా 3308 పరుగులు చేశాడు.

తక్కువ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్లు

  • ముత్తయ్య మరళీధరణ్ (శ్రీలంక)- 87 టెస్టులు
  • రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 98 టెస్టులు
  • అనిల్ కుంబ్లే (భారత్)- 105 టెస్టులు
  • షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)- 108 టెస్టులు
  • మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా)- 110 టెస్టులు

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్ఇండియా బౌలర్లు

  • అనిల్ కుంబ్లే- 619 వికెట్లు
  • రవిచంద్రన్ అశ్విన్- 500 వికెట్లు
  • కపిల్ దేవ్- 434 వికెట్లు
  • హర్భజన్ సింగ్- 417 వికెట్లు
  • ఇషాంత్ శర్మ- 311 వికెట్లు
  • జహీర్ శర్మ- 311 వికెట్లు

తక్కువ బంతుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్లు

  • మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా)- 25528 బంతులు
  • రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 25714 బంతులు
  • జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్)- 28150 బంతులు
  • స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్)- 28430 బంతులు
  • కోర్ట్నీ వాల్ష్ (జమైకా)- 28833 బంతులు

గావస్కర్ ప్రెడిక్షనే కరెక్ట్: ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​కు ముందు అశ్విన్ ఎవరిని ఔట్ చేసి 500 మైలురాయి అందుకుంటాడని బీసీసీఐ ఓ స్పెషల్ వీడియో చేసింది. అందులో దినేశ్ కార్తిక్, పార్థీవ్ పటేల్ సహా తదితరులు బెన్ డకెట్, జో రూట్, స్టోక్స్ పేర్లు చెప్పగా సునీల్ గావస్కర్ మాత్రం కరెక్ట్​గా అంచనా వేశాడు. అతడు జాక్ క్రాలీని ఔట్ చేసిన ఈ ఘనత అందుకుంటాడని ముందుగానే గెస్ చేశాడు.

కంగ్రాట్స్ ఛాంప్: అశ్విన్ ఘనతపై దిగ్గజం సచిన్ తెందూల్కర్ స్పందించారు. 'అశ్విన్ ది స్పిన్నర్, ఎప్పుడూ విన్నరే. టెస్టుల్లో 500 వికెట్లు అందుకోవడం ఓ మైలురాయి. కంగ్రాట్స్, ఛాంపియన్!' అని ట్వీట్ చేశాడు.

భారత్​ x ఇంగ్లాండ్​ - ఆ నాలుగు రికార్డులపై అశ్విన్ ఫోకస్​ !

అశ్విన్ - జడేజా : టెస్టుల్లో ఆల్​ టైమ్ రికార్డ్​

Last Updated : Feb 16, 2024, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.