ETV Bharat / sports

సంగీత్ సెలబ్రేషన్స్​లో స్పెషల్ మూమెంట్ - వరల్డ్ కప్​ విన్నర్స్​కు దిష్టి తీసిన నీతా అంబానీ - Nita Ambani Praises Rohith Sharma - NITA AMBANI PRAISES ROHITH SHARMA

Nita Ambani Praises Rohith Sharma Hardik : టీ20 వరల్డ్​కప్​ 2024 విన్నింగ్ హీరోస్​కు సంగీత్ సెలబ్రేషన్స్​లో స్టేజ్​పైకి పిలిచి మరీ అభినందించారు నీతా అంబానీ. వారికి ప్రత్యేకంగా దిష్టి తీయించారు. వేడుకకు వచ్చి మిగతా అతిథులు కూడా ఈ విన్నింగ్ హీరోలకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

source ANI
Nita Ambani Teamindia winning heroes (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 3:56 PM IST

Updated : Jul 6, 2024, 4:02 PM IST

Nita Ambani Praises Rohith Sharma Hardik in Anant Ambani Sangeeth Celebrations : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి అంగరంగ వైభవంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ పెళ్లి మరి కొద్ది రోజుల్లో జరగనుంది. ఈ వేడుకలో అంబానీ కుటుంబం ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి.

తాజాగా సంగీత్ సెలబ్రేషన్స్​ కూడా గ్రాండ్​గా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సల్మాన్‌ ఖాన్‌, విక్కీ కౌశల్‌, కియారా ఆడ్వాణీ-సిద్ధార్థ్‌ మల్హోత్రా, రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణె, అలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు మజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీతో పాటు టీ20 వరల్డ్ కప్​ 2024 విన్నింగ్​ టీమ్​ భారత జట్టులోని కొంతమంది ప్లేయర్స్​ కూడా హాజరై సందడి చేశారు.

అయితే ఈ వేడుకలో వరల్డ్​ కప్​ విన్నింగ్ హీరోలైన క్రికెటర్లను ప్రత్యేకంగా అభినందించారు రిలయన్స్​ ఫౌండేషన్ ఛైర్​పర్సన్​ నీతా అంబానీ. టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్​, హార్దిక్​ పాండ్యకు గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి దిష్టి తీయించారు.

అనంతరం క్రికెటర్లు, నీతా అంబానీతో కలిసి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని హారతి అందుకున్నారు. ఆ తర్వాత క్రికెటర్లను ఒకరి తర్వాత మరొకరిని స్టేజ్​పై పిలిచి మరీ ఫైనల్​ మ్యాచ్​లో వారి ప్రదర్శనను గుర్తు చేస్తూ ప్రశంసించారు నీతా అంబానీ.

ప్రముఖంగా పాండ్య గురించి ప్రస్తావించారు. "క్లిష్టమైన పరిస్థితులు ఎప్పుడూ ఉండవు. కానీ, వాటికి ఎదురు నిలిస్తేనే ముందుకు సాగగలరు" అంటూ పాండ్యపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి పేర్కొన్నారు. అలానే స్టేజ్​పైకి వచ్చిన తర్వాత ముకేశ్‌ అంబానీ కూడా క్రికెటర్లను అభినందించారు. 2011 తర్వాత వరల్డ్ కప్​ను దేశానికి అందించి దేశం గర్వపడేలా చేశారంటూ ప్రశంసించారు.

వేడుకకు హాజరైన మిగతా అథితులు వరల్డ్ కప్​ విన్నింగ్ హీరోలకు స్టాండింగ్ ఓవేషన్​ కూడా ఇచ్చారు. లేచినిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ దీన్ని తెగ షేర్ చేస్తున్నారు.

100 అడుగుల ధోనీ కటౌట్‌ - తెలుగు ఫ్యాన్స్ అభిమానం

యాంకర్లతో క్రికెటర్ల లవ్​స్టోరీలు- ఈ జోడీలు సూపర్ హిట్ బాస్​! - Cricketers Marry Sports Anchors

Last Updated : Jul 6, 2024, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.