Cricketers With Completely Different Jobs : క్రికెట్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఐపీఎల్ వచ్చిన తర్వాత అది కాస్త మరింతగా పెరిగింది. అయితే ఇందులోకి రావాలని ఎంతో మంది కలలు కంటుంటారు. తమ కలను నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అలా తమ ఆట తీరుతో రాణిస్తూ యువతకు స్ఫూర్తిగానూ నిలుస్తుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రం క్రికెట్లోకి అడుగుపెట్టకముందు వేర్వేరు ఫీల్డ్‌లో పని చేసినవారున్నారు. ఇంతకీ వారు ఎవరు ? వాళ్లు ఏ ఫీల్డ్‌లో పనిచేశారంటే ?
1. రవిచంద్రన్ అశ్విన్
తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ టీమ్ఇండియాలోకి రాక ముందు సాప్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసేవారు. 2010లో భారత్ జట్టులో చోటు సంపాదించిన అశ్విన్ అప్పటి నుంచి టీమ్ఇండియా విజయంలో తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు. అంతే కాకుండా ఐపీఎల్ లో 'పంజాబ్ కింగ్స్ 'కు కెప్టెన్ గానూ వ్యవహరించాడు.
2. వరుణ్ చక్రవర్తి
2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా తరఫున ఆడిన వరుణ్ చక్రవర్తి అంతకు మందు ఆర్కిటిక్ట్గా విధులు నిర్వహించేవాడు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేస్తూ టీమ్ఇండియాకు సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
3. షమార్ జోసెఫ్
ఇటీవల కాలంలోనే వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించిన షమార్ జోసెఫ్ క్రికెటర్ కాకముందు బాడీ గార్డు గా పని చేసేవాడు. జోసెఫ్ నివసించే గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం కూడా ఉండేది కాదట. అయితే తనలోని ప్రతిభను గుర్తించిన జోసెఫ్, తన జాబ్ వదిలేసి ఆట మీదే పూర్తి దృష్టి సారించాడు. అలా ఎట్టకేలకు వెస్టిండీస్ టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు. తన తొలి మ్యాచ్ లోనే స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్ వికెట్లు తీసి అందరి దృష్టి ఆకర్షించాడు.
4. సౌరభ్ నేత్రావాల్కర్
భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రావాల్కర్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అమెరికాలో స్థిరపడ్డ ఈ ఆల్‌రౌండర్. క్రికెటర్‌గా మారకముందు ఒరాకిల్ అనే సంస్థలో జాబ్ చేసేవారు. ఇక ఇతడు భారత్ తరపున అండర్ -19 జట్టులో ప్రాతినిథ్యం వహించాడు.
5. నాథన్ ఎల్లీస్
ప్రస్తుతం ఆస్ట్రేలియా తరఫున టీ20 మ్యాచులు ఆడుతున్న నాథన్ క్రికెటర్‌గా మారక ముందు పలు రకాల పనులు చేసేవాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు.
68 పరుగులకు 7 వికెట్లు - క్రికెట్ స్టార్‌గా మారిన సెక్యురిటీ గార్డు