2024 IPL Playoffs Akshay Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకి ఫ్యాన్ బేస్ బలంగా ఉంది. తమ ఫేవరెట్ టీమ్ పర్ఫార్మెన్స్ చూసేందుకు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు తరలి వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చేసే పోస్టులు, లైకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ తమకు నచ్చిన టీమే గెలుస్తుందని విశ్లేషణలు వినిపిస్తుంటారు. అప్పుడప్పుడు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అనాలసిస్‌లు కూడా నచ్చకపోతే, విమర్శిస్తూ కామెంట్లు చేస్తుంటారు. ఇప్పుడు ఈ వంతు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కి వచ్చింది. రీసెంట్‌గా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌పై అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, టాటా IPL 2024 అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. 10 భాషల్లో ప్రసారం చేస్తోంది. అభిమానులను మరింత ఆకర్షించేందుకు, ఐపీఎల్‌పై ఆసక్తి పెంచేందుకు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఐపీఎల్ స్పెషల్ షోలు కూడా నిర్వహిస్తోంది. తాజాగా ఐపీఎల్ ఆన్ స్టార్ అనే షోకి బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ పాల్గొన్నారు.
అక్షయ్ మీరూ క్రికెట్ చూడరు కదూ?
ఈ సందర్బంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న భారత్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్, 2024 ఐపీఎల్‌లో ఏ టీమ్‌లు ప్లేఆఫ్స్‌కి చేరుతాయని అనుకుంటున్నారు? అని ప్రశ్నించాడు. ఇందుకు అక్షయ్ కుమార్ సమాధానమిస్తూ 'పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుతాయి' అని చెప్పాడు. అలానే ట్రైగర్ ఫ్రాఫ్' ముంబయి, సీఎస్కే, ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్' పేర్లు చెప్పాడు.
అక్షయ్ కుమార్ టీమ్ సెలక్షన్‌పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ యూజర్ కామెంట్‌లో 'ఇప్పుడు అర్థమైంది! అక్షయ్ కుమార్ ఎంచుకునే స్క్రిప్ట్‌లు ఈ మధ్య ఎందుకు సరిగా లేవో' అని పేర్కొనగా, 'అక్షయ్ ఐపీఎల్ చూడరని క్లియర్‌గా అర్థమవుతోంది' మరో నెటిజన్ అని రాశాడు. చాలా కామెంట్లు అక్షయ్ సెలక్షన్‌ని వ్యతిరేకంగా వచ్చాయి. మరికొందరు ఫన్నీగా కూడా స్పందిస్తున్నారు.
'ఈ ఫామ్ మాకు ఎంతో అవసరం - లక్ కూడా ఉండాల్సిందే' - Jos Buttler Rajasthan Royals
అత్యధిక పరుగులే కాదు - ఆ రికార్డులోనూ విరాట్‌కు తిరుగేలేదు! - Virat Kohli RCB