ETV Bharat / spiritual

పెద్దలు ఎవ‌రికీ రుణ‌ప‌డ‌కూడ‌దంటారు- ఎందుకో తెలుసా? - ఎవరికీ రుణపడకూడదంటారు ఎందుకో తెలుసా

Why We Are Not Indebted To Anyone : మ‌నం ఎవ‌రికీ రుణ‌ప‌డ‌కూడ‌దు అని మ‌న పెద్దలు చెబుతారు. వాళ్లు అలా ఎందుకు అంటారు అని మీకెప్పుడైనా సందేహం వ‌చ్చిందా ? దానికి స‌మాధానం ఈ ఆర్టిక‌ల్​లో తెలుసుకుందాం.

why we are not indebted to anyone
why we are not indebted to anyone
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 11:46 AM IST

పెద్దలు ఎవ‌రికీ రుణ‌ప‌డ‌కూడ‌దంటారు- ఎందుకో తెలుసా?

Why We Are Not Indebted To Anyone : మ‌న పూర్వీకులు, పెద్ద‌లు ఎన్నో మంచి మాట‌లు చెప్పారు. బోధించారు. అందులో చాలా అర్థ‌ముంటుంది. కానీ మ‌న‌కు అవి అంత సుల‌భంగా అర్థం కావు. అలాంటి మాటల్లో ఎవ‌రికీ రుణ‌ప‌డ‌కూడ‌దు అనే మాట ఒకటి. అస‌లు అలా ఎందుకు అన్నారు. అందులోని అంత‌రార్థం ఏమిటి ? వీటితో పాటు ధ‌ర్మం- మ‌ర్మం అంటే ఏంటి ? ధ‌ర్మాచ‌ర‌ణ‌లో మ‌నం గ‌మ‌నించే అంశాలేమిటి? అనే విష‌యాలు తెలుసుకుందాం.

ధ‌ర్మం ప‌ది లక్ష‌ణాల్ని క‌లిగి ఉంటుందని యాజ్ఞ‌వక్ల్య స్మృతి చెబుతోంది. ధ‌ర్మాన్ని తెలుసుకోవ‌డ‌మే మ‌ర్మం. శ్రీ‌మ‌ద్భాగ‌వ‌తం చిత్ర‌కేతువు పాక్షాణంలో ఉన్న ఓ శ్లోకం ఉంది. అందులో రుణానుబంధం అంటే ఏంటి? అస‌లా అనుబంధం ఎందుకు ఉంటుంది? త‌దిత‌ర అంశాలుంటాయి.

రుణానుబంధ రూపేణా
ప‌శు ప‌త్నాసుతే ద‌యః
రుణ‌క్ష‌యేక్ష‌యం యాతీ
కాత‌త్ర ప‌రివేద‌నా

చిత్ర‌కేతువు అనే రాజుకు భార్య ఉంది. ఆమె తన సంతానాన్ని కోల్పోయి విల‌పిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆమెకు చిత్ర‌కేతువు రాజు రుణానుంబంధ రూపేణా అంటూ ఈ శ్లోకాన్ని బోధిస్తాడు. గ‌త జ‌న్మ‌లోని రుణానుబంధాల ద్వారానే మ‌న‌కు భ‌ర్త‌, సంతానం, ప‌శువుల లాభం క‌లుగుతాయి. ఎంత రుణానుబంధముందో అంత‌కాల‌మే ప‌శువులు కానీ, భ‌ర్త కానీ, సంతానం కానీ మొద‌లైన వారు మ‌న‌తో ఉంటారు. ఒక్క‌సారి ఈ రుణం తీర‌గానే వెళ్లిపోతారు. ఇది ఎంత‌కాల‌మో ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రు ఎవ‌రికి బాకీనో తెలియ‌దు. మ‌న సంతాన‌మంతా మ‌న‌కు బాకీదార్లే. అందుకే పెద్ద‌లు, పిల్లల చేతిలో నుంచి డ‌బ్బులు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

అలాగే మంచి మాట‌లు చెప్పే వాళ్లు కూడా మ‌న‌కు బాకీదార్లు. అలాంటి వారు మ‌న‌కు మేలు చేస్తారు. కానీ ఒక్కసారి వారు దూర‌మైతే మ‌ళ్లీ అలాంటి వారు దొర‌కరు. ఇలా వెళ్లిపోయిన వారి గురించి ఆలోచించి లాభం లేదు. వారు ఆ రుణం తీర‌గానే వారు వెళ్లిపోతారు. దానికోసం ఏడ‌వ‌టం ఎందుకు అని పెద్ద‌లు చెబుతారు.

రుణం అంటే ఎవ‌రి దగ్గ‌ర‌నో మ‌నం తీసుకున్నది. అంటే ధ‌నం, వ‌స్తు సంప‌ద‌లు, స‌హాయం ఇలా ఏవైనా కావ‌చ్చు. ఈ కార‌ణంగా ఎవ‌రి ద‌గ్గ‌ర ఏం తీసుకున్నా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చెల్లించే ప్ర‌య‌త్నాలు చేయాలి. ఇది క‌ర్మ రూపంలో మ‌న‌ల్ని అనుస‌రిస్తుంది.

సంతానం కూడా రుణం తీర‌గానే వెళ్లిపోతారు. రుణానుబంధం లేకుంటే అది మ‌న‌కు ఆత్మానుబంధాన్ని క‌లిగిస్తుంది. అలా కాకుండా ఎవ‌రి ద‌గ్గ‌ర ఏమైనా దొంగిలించాల‌ని చూస్తే హీన ద‌శ ప‌డుతుంది. ధ‌ర్మం ఏమ‌ని చెబుతుందంటే ఇతరుల నుంచి మ‌నం ఏదీ కూడా ఉచితంగా స్వీక‌రించ‌కూడ‌దు. ఒక‌వేళ తీసుకుంటే త్వర‌గా ఇచ్చే ప్ర‌య‌త్నం చేయాలి.

అలాగే రుణానుబంధ‌మే కాకుండా శ‌త్రుశేషం ఉండ‌కూడ‌దు. శ‌త్రు శేషం అంటే మ‌నుషులు కాదు ఆరు శ‌త్రువులు. అవి కామం, క్రోధం, లోభం, మోహం, మ‌దం, మాత్స‌ర్యం. ఇవి ఉండ‌కూడ‌దంటే వాటి మీద మ‌మ‌కారం ఉండ‌కూడదు. వీట‌న్నింటికీ మూలం అసూయ అనే ల‌క్ష‌ణం.

బెడ్​రూమ్​లో ఈ వస్తువులు ఉంచుతున్నారా? - అయితే నెగిటివ్ ఎనర్జీకి వెల్​కమ్ చెబుతున్నట్టే!

అయోధ్య వెళ్లాలనుకునేవారికి గుడ్​న్యూస్​- హైదరాబాద్ ​నుంచి డైరెక్ట్​ ట్రైన్​, పూర్తి వివరాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.