Which Direction is Best For Water Tank : ఏ ఇంటికి అయినా నీటి వసతి ఎంతో ప్రధానమైనది. వాస్తు శాస్త్రం ప్రాధమిక సూత్రం ప్రకారం ఇంటికి ఈశాన్యంలో నీటి బావులు, నల్లా, వాటర్ ట్యాంకులు, సంపులు వంటివి ఉండాలి. దీంతో కొంత మంది ఈశాన్యంలో నీటి కొళాయి లేదా బక్కెట్లలో నీళ్లు పెడుతుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈశాన్యంలో భూమి లోపల నీరు నిల్వ ఉండాలి. అప్పుడే ఇంటికి శ్రేయస్కరం. దీంతో పాటు ఈశాన్యంలో నీటి నిర్మాణాలు ఏర్పాటు చేసేటప్పుడు తూర్పు, ఉత్తరం వైపు గోడకు తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం మంచింది. అలాగే ఈ గుంతను సింహద్వారం, ఇంటి ప్రహరీ గోడ గేటుకు ఎదురుగా గానీ ఉండకూడదు. నల్లా కోసం కోసం ప్రహరీ గోడ గేటు వద్ద గుంత చేయడం అరిష్టమని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంటి యజమానురాలికి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే నీటి ఏర్పాట్లు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెబుతోంది.
ఆగ్నేయం పెరిగితే ఇల్లాలికి కష్టాలు!
ప్రతి ఇంటి ఆగ్నేయ దిశ ఇల్లాలికి ప్రముఖ స్థానమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఇంటి ఆగ్నేయం పెంచకూడదు. దీని వల్ల ఇంటి యజమానురాలికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఆగ్నేయం పెరిగి ఉన్న ఇంట్లో ఉండాల్సి వస్తే అక్కడ చిన్న చుట్టు ఇల్లు వంటివి నిర్మించుకోవాలి. ఇలా చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల ఇంటి ఇల్లాలు ఆరోగ్యప్రదమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.
ఆగ్నేయంలో బావి ఏర్పాటు చేసుకోవచ్చా?
ఈశాన్యంలో నీరు నిల్వ ఉంచడం ఎంత ముఖ్యమో, ఆగ్నేయంలో నీటి ఏర్పాటు చేసుకోవడం అంత తప్పు. ఒకవేళ ఇంటి ఆగ్నేయంలో నుయ్యిలోని నీటిని ఇంటి అవసరాలకు వాడితే, అందులో నివసించే వారికి ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి సంబంధాలు దెబ్బతింటాయి. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉండేవాళ్లు సైతం శత్రువులుగా మారే ప్రమాదం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ దోషాలన్నీ ఇంటి యజమాని కన్నా యజమానురాలిపైనే ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగ్నేయంలో బావి ఉంటే ఇంట్లో ఉండే వారి అభివృద్ధి ఆశాజనకంగా ఉండదు. ఈశాన్యంలో బావి ఉండడమే అత్యంత శ్రేయస్కరం అని శాస్త్రం చెబుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాస్తు ప్రకారం మీ ఇంట్లో డస్ట్‌బిన్ సరైన దిశలో ఉందా? - లేదంటే ఆర్థిక కష్టాలు వస్తాయట!
వాస్తు ప్రకారం వంట గది కిటికీలు ఎటువైపు ఉండాలి? జాబ్ ప్రమోషన్ కావాలంటే ఏం చేయాలి?