Which Direction Is Best For Electronics : ప్రస్తుత కాలంలో విద్యార్థులకు కంప్యూటర్ వాడకం తప్పనిసరిగా మారింది. దీంతో వాస్తు శాస్త్రం ప్రకారం కంప్యూటర్ ఎక్కడ పెడితే మంచిది అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే, విద్యార్థులు విద్యలో రాణించాలంటే తూర్పు, పడమర వైపు కంప్యూటర్ స్క్రీన్ ఉండేలా ఏర్పాటు చేసుకున్నట్లైతే మంచిదని శాస్త్రం చెబుతోంది. అలా కాకుండా ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉంటే కంప్యూటర్లకి తరచుగా రిపేర్లు వస్తాయని ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు మాచిరాజు వేణుగోపాల్ తెలిపారు. ఆయన చెప్పిన మరికొన్ని వాస్తు సలహాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇన్వెర్టర్లు ఎక్కడ పెట్టాలి?
Where Should Inverter Be Placed : సాధారణంగా మనం ఇంట్లో ఇన్వెర్టర్లు ఏర్పాటు చేసేటప్పుడు మెట్ల కిందనో లేదా ఏదో ఒక ప్రదేశంలో పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇలా పెట్టేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి ఆగ్నేయంలో మెట్లు ఉన్నట్లయితే వాటి కింద ఇన్వెర్టర్లు పెట్టుకోవచ్చు. అంతేగాని మెట్లు ఇతర దిక్కులో ఉంటే అక్కడ ఇన్వెర్టర్లు ఏర్పాటు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే కరెంట్ స్విచ్ బోర్డులు వంటివి కూడా ఆ గదికి ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
ఇంట్లో పెంచుకునే చెట్లను గురించి వాస్తు ఏమి చెబుతోంది?
కొంతమంది వారి అభిరుచి ప్రకారం ఇంట్లో కొబ్బరితో పాటు వివిధ రకాల చెట్లను పెంచుతుంటారు. అయితే ఈ చెట్లు పెంచుకునే విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. తూర్పు, ఉత్తరం వైపున ఉన్న చెట్లు ఇంటికంటే ఎత్తు పెరిగితే వాస్తు ప్రకారం తప్పుగా భావిస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చెట్లు ఇంటికన్నా ఎత్తు పెరిగినప్పుడు మాత్రమే వాటిని తొలగించాలి. అంతేగాని ఉత్తరం లేదా తూర్పున ఉన్న కారణం వల్ల తొలగించాల్సిన అవసరం లేదు. ఆ దిక్కుల్లో ఇంటికన్నా తక్కువ ఎత్తులో చెట్లు ఉన్నప్పుడు ఎలాంటి నష్టం ఉండదు.
కొబ్బరి చెట్లు ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యంలో పెంచకూడదు. ఇలా నాటడం వల్ల అక్కడ భారం పెరిగి దోషంగా మారుతుంది. ఇలా పెంచడం వల్ల ఆ చెట్టు కాండం పెరిగి ఉత్తరం, తూర్పు ప్రహరీ గోడపైన వాలడం వల్ల భారం ఏర్పడి దోషంగా మారుతుంది. కాబట్టి ఆ చెట్టును తొలగించాల్సి వస్తుంది. అందుకే ఈ పరిస్థితి రాకుండా ఆయా దిక్కుల్లో కొబ్బరి చెట్టు పెంచకపోవడమే ఉత్తమం. ప్రహరీ గోడకు దూరంగా చెట్లు పెంచితే ఎలాంటి దోషం ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి? ఆగ్నేయంలో బావి ఉంటే అరిష్టమా?
వాస్తు ప్రకారం వంట గది కిటికీలు ఎటువైపు ఉండాలి? జాబ్ ప్రమోషన్ కావాలంటే ఏం చేయాలి?