ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈ వారం విహహయోగం - ధనప్రాప్తి ఖాయం - శ్రీ వేంకటేశ్వర దర్శనం శుభప్రదం!

2024 అక్టోబర్‌ 27వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 5:01 AM IST

Weekly Horoscope From October 27th to November 2nd 2024 : 2024 అక్టోబర్‌ 27వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా, విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు, నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడంతో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. కుటుంబంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. నూతన వస్తు, వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు తమ వృత్తి పట్ల అంకిత భావంతో ఉండాలి. వ్యక్తిగత దూషణలు కూడదు. వృత్తి పరంగా వారం మధ్యలో ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉండవచ్చు. సంయమనం పాటిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తే గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు సమయానుకూలంగా నడుచుకోవడం అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపార నిమిత్తం దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధం దృఢ పరచుకోడానికి ప్రయత్నిస్తారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర ఆరాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. వృత్తి పరమైన సమస్యల పరిష్కారానికి కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మేలు. ఉద్యోగులు, వ్యాపారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ పట్ల దృష్టి సారించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తీవ్రమైన కృషితోనే అనుకూలత ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు పొందడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. రుణ బాధలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శనికి తైలాభిషేకం చేయిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు, ఉద్యోగులు లక్ష్యసాధనకు ప్రాధాన్యతనిచ్చి తమ తమ రంగాలలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ వారం పొందుతారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి ఉంది. న్యాయపరమైన విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మతపరమైన, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం మంచి అదృష్టం, మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. స్నేహితుల సహాయంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వారం ప్రథమ భాగం అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారాన్ని అందుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి నైపుణ్యాలను పెంచుకోవడం, తీవ్రమైన కృషి అవసరం. వ్యాపార పరంగా చేసే పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌లు లాభదాయకంగా ఉంటాయి. వారం ద్వితీయార్ధంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ సంప్రదించడం అవసరం. జీవిత భాగస్వామితో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఉద్యోగులు గణనీయమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుతుంది. కోరుకున్న చోటికి బదిలీ కూడా కావడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. వ్యాపార ప్రయోజనాల నిమిత్తం దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేముందు భాగస్వాములను సంప్రదించడం అవసరం. వృత్తి పరంగా ఎదగడానికి స్నేహితుల ప్రోద్భలం, ప్రోత్సాహం ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. వ్యసనాలకు దూరంగా ఉండాలి. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలి. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు జీవితంలో ఎదగడానికి ఒక అవకాశంగా మలచుకుంటే విజయం మీదే! అందరితో స్నేహపూర్వకంగా, సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధించాలంటే తీవ్రమైన కృషి అవసరం. వృత్తి నిపుణులు, వ్యాపారులు సమిష్టి కృషితోనే విజయాలు సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం మంచిది. సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు అందరిపై రుద్దడం పొరపాటు. ఇది మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, మీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు కూడదు. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆర్థిక విషయాలపై అప్రమత్తంగా ఉండడం అవసరం. విలాస వస్తువుల కొనుగోలు కోసం రుణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. వారసత్వపు ఆస్తి వివాదాలు కోర్టు బయటే పరిష్కరించుకోవడం ఉత్తమం. వృత్తి, ఉద్యోగాలలో తీవ్రమైన కృషితోనే ఆశించిన ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు. వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడతారు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృతి, వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. బద్దకాన్ని వీడి కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు. ఖర్చు చేసేటప్పుడు తెలివిగా వ్యవహరించాలి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో పెద్దల పట్ల బాధ్యతతో మెలగండి. కుటుంబ వ్యవహారాల్లో హుందాగా ఉంటే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ బలహీనతలను శత్రువులు అవకాశంగా తీసుకునే ప్రమాదముంది. కాబట్టి బలహీనతలను అధిగమించండి. వృత్తి, వ్యాపారాలలో సన్నిహితుల మద్దతుతో విజయం సాధిస్తారు. కీలకమైన వ్యవహారాలలో మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొని అధికంగా ధనవ్యయం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారరీత్యా చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తిని ఈ వారం కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంపై ఆసక్తి చూపిస్తారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతి ఉంటాయి. బుద్ధిబలంతో తెలివిగా వ్యవహరించి వృత్తి పరంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు సమాజంలో మీ హోదాను పెంచుతాయి. కళాకారులు, మీడియా రంగాలలో పనిచేసే వ్యక్తులకు ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు తిరుగులేని విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. గృహంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. శ్రీలక్ష్మీ అష్టోత్తర పారాయణతో శుభ ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.