ETV Bharat / spiritual

ఆ రాశివారు స్వయంకృషిని నమ్ముకుంటే చాలు - అన్నింటా విజయం గ్యారెంటీ! - Weekly Horoscope

Weekly Horoscope From 21st July to 27th July 2024: 2024 జులై​ 21వ తేదీ నుంచి జులై 27వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 4:15 AM IST

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From 21st July to 27th July 2024 : 2024 జులై​ 21వ తేదీ నుంచి జులై 27వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ వారం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం మరింత అదృష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్లు ఆటంకాలు అధిగమించి విజయం సాధిస్తారు. వ్యాపారులకు వారం ప్రారంభంలో ఆశించిన ప్రయోజనాలు లేకపోయినా, వారం చివరలో మంచి లాభాలను అందుకోవడమే కాకుండా, సంస్థను అభివృద్ధి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు స్దాన చలనం ఉండవచ్చు. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రత్యర్థులు లక్ష్యం నుంచి మీ దృష్టిని మరల్చడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటి మరమ్మతుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. ఆదాయ వృద్ధి ఉంటుంది. వ్యాపారులకు వారం మొదటి భాగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వారం చివరి భాగంలో, స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. స్వయంకృషిని నమ్ముకొని ముందుకెళ్తే అన్ని రంగాల వారికి విజయం ఉంటుంది. ఇతరులను నమ్మి మోసపోవద్దు. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. స్దాన చలనం ఉండవచ్చు. మారుమూల ప్రాంతాలకు బదిలీ కావడంతో కొంత నిరుత్సాహంగా ఉంటారు. వ్యాపారులు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆస్తి కొనుగోళ్లు, అమ్మకాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అవసరం. సంతానానికి సంబంధించిన శుభవార్తలతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారికి దూరంగా ఉంటే మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం సహకరించదు. ఉద్యోగులు చేపట్టిన పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్సాహం, సహనం కోల్పోకూడదు. వ్యాపారులు వ్యాపార నిమిత్తం దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన బాధ్యతల స్వీకరణ వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యల నిమిత్తం ధనవ్యయం ఉంటుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారు తమ కెరీర్​లో ముందుకు సాగాలనే కల నెరవేరుతుంది. చేసే పనిలో అభివృద్ధి, ఆర్ధిక పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, సహకారం ఉంటుంది. లలితకళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ వారం భూమి, భవనాలు, వాహనాలను కొనుగోలు విక్రయాలకు మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం అదృష్టం వరిస్తుంది. అద్భుతమైన శుభవార్తలు వినవచ్చు. సన్నిహిత మిత్రులతో విందు వినోదాలలో పాల్గొని సరదాగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. సంపద పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ప్రతికూల ఆలోచనలు వీడండి. దైవబలం అనుకూలంగా ఉంటుంది. విశేషమైన ఆర్ధిక లాభాలు ఉంటాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలలో, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఉన్నతాధికారుల ఆశీర్వాదం, సహోద్యోగుల మద్దతు ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని ఆనందకరమైన వార్తలను అందుకుంటారు. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు మరియు అమ్మకాల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం అదృష్టం వరిస్తుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో అదృష్టవంతులుగా, లాభదాయకంగా ఉంటారు. వారం ప్రారంభంలో గణనీయమైన ఆర్థిక విజయాన్ని పొందుతారు. వ్యాపారులు వ్యాపారంలో ఊహించని ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులను పొందుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విలాసాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉన్నా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. బంధు మిత్రుల వల్ల ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. కోర్టుకు వెళ్లవలసి ఉంటుంది. ఉద్యోగస్తుల పని తీరు పట్ల పై అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉంటారు. లక్ష్యంపై దృష్టి పెట్టండి. సహోద్యోగులందరితో సమన్వయాన్ని కొనసాగించడం ఉత్తమం. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉంటే మేలు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే కలహాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. గురు, రాహు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మరికొంతకాలం వేచి చూడాలి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో డాకుమెంట్స్ పూర్తిగా పరిశీలించిన తరువాతే ముందడుగు వేయండి. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ప్రయత్న పూర్వక విజయాలుంటాయి. చేపట్టిన పనుల్లో పురోగతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సహచరులతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. భూములు, గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటికి బంధు మిత్రుల రాకతో పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.