ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈ వారం ప్రమోషన్ పక్కా- క్రేజీ ట్రిప్​కు ప్లాన్​!! - Weekly Horoscope Telugu - WEEKLY HOROSCOPE TELUGU

Weekly Horoscope From May 19 th to 25th May 2024 : 2024 మే 19వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 4:43 AM IST

Weekly Horoscope From May 19 th to 25th May 2024 : 2024 మే 12వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టపడి సాధించించుకుంటే ఉండే తృప్తి విలువ ఏమిటో గ్రహిస్తారు. ఈ వారం పనులన్నీ నెమ్మదిగా సాగుతాయి. అయితే అన్ని పనులు సకాలంలోనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపార రంగాల వారు పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ అవన్నీ తాత్కాలికమే! మీ పని తీరుతో అందరినీ మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులు, స్థిరాస్తి రంగం వారు గణనీయమైన లాభాలు పొందవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు తమ వృత్తి పట్ల అంకిత భావంతో ఉండాలి. ఇతరుల వ్యక్తిగత జీవితంలో జోక్యం కూడదు. వారం మధ్యలో ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉండవచ్చు. సంయమనం పాటిస్తూ సమస్యల పరిష్కారినికి చొరవ చూపించండి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధం దృఢ పరచుకోడానికి ప్రయత్నిస్తారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. సమస్యలకు పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మేలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ పట్ల దృష్టి సారిస్తే మేలు. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. శివారాధనతో అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు, ఉద్యోగులు తమ రంగాల్లో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు ఈ వారం పొందుతారు. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి ఉంది. న్యాయపరమైన విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల వలన గణనీయమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆవేశంతో, తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు చేటు తెస్తాయి. అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల, ఉన్నతాధికారుల సహకారం పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. వారాంతంలో శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎక్కుతారు. గురువుల సలహాలు పాటిస్తే మంచిది. శివాష్టకం పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. గణనీయమైన ఆర్థిక లాభం ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు కొత్త ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ప్రతికూల ఆలోచనలు వీడండి. దైవబలం అనుకూలంగా ఉంటుంది. విశేషమైన ఆర్ధిక లాభాలు ఉంటాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలలో, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇష్ట దేవత ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం శ్రేష్టమైన కాలం నడుస్తోంది. అన్ని రంగాల వారికి విజయసిద్ధి ఉంది. అన్నింటా సంతోషం, అదృష్టం పనిలో పురోభివృద్ధి ఉంటాయి. ఆర్ధికంగా సంతృప్తి కరమైన ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళతారు. కీలక విషయాలకు సంబంధించి సమాజంలో ముఖ్య వ్యక్తులను కలుస్తారు. మీ పనితీరుకు పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి రంగం వారు ఆస్తి వ్యవహారాల వివాదాల నుంచి బయటపడతారు. మంచి లాభాలను గడిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతానం అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. హనుమాన్ ఆలయ సందర్శన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉండదు. మానసికంగా అశాంతిగా ఉంటారు. ఉద్యోగస్తులు పని ప్రదేశంలో ప్రత్యర్థుల నుంచి సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రయాణావకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభం ఉంటుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. సుబ్రమణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉన్నా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. బంధు మిత్రుల వల్ల ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వారం మొదట్లో మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విదేశీయానం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. ఉద్యోగస్తులకు ఆదాయ వనరులు అధికంగా ఉంటాయి. సంపద పెరుగుతుంది. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. ఉన్నతాధికారుల సహాయంతో భూవివాదాలు పరిష్కరిస్తారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నూతన ఆలోచనావిధానంతో పనిచేసి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా ఎదుగుతారు. సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారులకు రుణబాధ తొలగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. మంచి లాభాలను పొందుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణం, లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావచ్చు. కోర్టుకు వెళ్లవలసి ఉంటుంది. ఉద్యోగస్తుల పని పట్ల పై అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉంటారు. లక్ష్యంపై దృష్టి పెట్టండి. సహోద్యోగులందరితో సమన్వయాన్ని కొనసాగించడం ఉత్తమం. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉంటే మేలు. కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే కలహాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. గురు, రాహు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.