ETV Bharat / spiritual

ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే? - Weekly Horoscope Telugu - WEEKLY HOROSCOPE TELUGU

Weekly Horoscope From 14th July to 20th July 2024 : 2024 జులై​ 7వ తేదీ నుంచి జులై 13వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 3:51 AM IST

Weekly Horoscope From 14th July to 20th July 2024 : 2024 జులై​ 7వ తేదీ నుంచి జులై 13వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం గొప్ప శుభకరంగా ఉంటుంది. అదృష్టం గొప్ప అవకాశాలను అందిస్తుంది. వారం ప్రారంభంలో అనుకోని ధన లాభం పొందవచ్చు. వృత్తి, వ్యాపార రంగాలలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో సత్వర విజయం ఉంటుంది. అయితే ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. వారం చివరలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాల నుంచి ఆహ్వానం అందుతుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేయడానికి అదనపు శ్రమ, కృషి అవసరం. ఒక ప్రణాళిక ప్రకారం సహోద్యోగుల సహకారంతో పనిచేస్తే అన్నీ పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు వారం ప్రథమార్ధం అనుకూలించక పోయినా ద్వితీయార్ధంలో ఊహించని లాభాలు అందుకుంటారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు గడప ఎక్కేముందు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు లక్ష్యసాధన కోసం కష్టపడాల్సి ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్నీ రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు అప్పచెప్పిన కొత్త పనులు కష్టతరంగా ఉన్నప్పటికీ తెలివితేటలతో సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువు నుంచి దృష్టి మరల్చవచ్చు. కమిషన్‌పై వ్యాపారులకు, స్థిరాస్తి రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండక అశాంతితో ఉంటారు. కుటుంబ సమస్యలు మధ్యవర్తి ద్వారా పరిష్కారం అవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతాయి. చేతిలో ఉన్న ప్రాజెక్టులు చేజారిపోవడం వల్ల విచారంగా ఉంటారు. ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు ఆదాయ వనరులు దెబ్బతినవచ్చు, వ్యాపారంలో పోటీదారుల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవచ్చు. కుటుంబ సమస్యలతో మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అభయ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు వారం ప్రారంభంలో చాలా అదృష్టం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉంటాయి. పైస్థాయి అధికారులతో పరిచయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సంపద పెరుగుతుంది. ఎంతో కాలంగా భూములు, ఆస్తులు క్రయవిక్రయాలు చేయాలనుకునేవారికి ఈ వారం కల నెరవేరుతుంది. రాజకీయ నాయకులు ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. వారం రెండో భాగంలో, మీ ఆర్థిక విజయానికి వృత్తిలో పురోగతికి మార్గం సుగమం చేసే ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సహోద్యోగులతో, సహచరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం వస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయం ఆశించినంతగా ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో జీవిత భాగస్వామి అండ ఉంటుంది. శివాష్టకం పఠించడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది. వ్యాపారులకు ఆదాయం పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరిగినప్పటికీ, ఊహించని లాభాలు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు చాలా కాలంగా బదిలీ, పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. వారం చివరలో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రేయోభిలాషుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. సమీప బంధువుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోకపోతే కలహాలు తప్పవు. వృత్తి నిపుణులు స్నేహితుల సహకారంతో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారు. అంతర్జాతీయ వ్యాపారంలో వృత్తిని కొనసాగించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సమష్టి నిర్ణయాలతో మేలు జరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలోని ప్రత్యర్థులు మీ పురోగతిని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. దైవబలంతో సమస్యను అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శక్తినిస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారు లక్ష్య సాధన కోసం అదనపు శ్రమ, కృషి అవసరం. ఆర్ధికంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, నూతన ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. ప్రుభుత్వ పరంగా చేపట్టిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన సమస్యల గురించి చర్చిస్తారు. మిత్రుల సహాయంలో ఆర్ధిక పరంగా లాభదాయకమైన పథకంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. శ్రీరామ నామ జపం మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారంలో ఆర్థిక లాభం, పురోగతి పుష్కలంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. పని ప్రదేశంలో సమస్యలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పరంగా పెండింగ్ లో ఉన్న నిధులు అందుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు గొప్ప లాభాలను పొందుతారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తారు. సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అందిన శుభవార్తలతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల కారణంగా సంపద పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. పది మందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.