Vastu Tips To Get Rid Of Debt : మనిషికి రుణాలుంటే చింతతోనే జీవితం గడుస్తుంది. రుణాల బాధ, ఆరోగ్య బాధ ఈ రెండూ కూడా మనుషులకు ఇబ్బందిని కలిగిస్తాయి. అలాంటి వాళ్లు త్వరగా నీరసపడి పోతుంటారు. వీటన్నింటి నుంచి బయటికి వస్తానా? లేదా అనే ఆలోచనల చుట్టు ముట్టడం వల్ల సతమవుతూ ఉంటాడు. దీని వల్ల నిద్ర లేమికి కూడా గురయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ బాధలకు గల కారణాలేంటి? వాస్తు ఏమని చెబుతోంది? పరిష్కార మార్గాలేంటో ఇందులో చూద్దాం.
వాస్తు ప్రకారం కుబేరుడు ఉత్తరానికి అధిపతి. ఈ ఉత్తరంలో గోడ కట్టడంలో ఏదైనా లోపాలుంటే ఇంటి యజమాని ఎక్కువ అప్పులు చేయాల్సి ఉంటుందని నమ్ముతారు. దీని ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుందని వాస్తు నమ్మేవాళ్లు చెబుతారు. దీంతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఉత్తరం వైపు రోడ్డు ఉండే ఇంట్లో నివసించే వారు ఉత్తర వాయువ్యంలో గేటు తెలియకుండా పెట్టినా అదే గేటు ప్రధాన ద్వారంగా పెట్టి నడిచినా పిల్లలకు సరైన అవకాశాలు రావని నమ్ముతారు.
వాస్తు ప్రకారం ఉత్తర వాయువ్యం ఖాళీగా ఉండాలి. దాన్ని ఆనుకుని గోడలు కట్టుకోవాలి. కాంపౌండ్ వాల్‌ను ఆనుకుని టాయిలెట్ల నిర్మాణం చేపట్టినట్లయితే రుణగ్రస్థ సంబంధమైన విషయాలతో మనిషి బాధపడుతూ ఉంటాడు. వాయువ్య దోషం అధికంగా ఉండటం వల్లే రుణాలు అధికంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దోషాన్ని సవరించుకోవడానికి పశ్చిమ వాయువ్యం నుంచి ఈశాన్య వైపు కూడా ఖాళీలు ఉంచుకుని ఈశాన్య దిశవైపు ఉండేలా గోడ కట్టుకుంటే రుణ విమోచనకు ఆస్కారం ఉంటుంది. వాయువ్యంతో పాటు ఈశాన్యం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. ఈశాన్యంలో ఎలాంటి వస్తువులూ ఉంచుకోకూడదు. నిత్యం ఈశాన్యం శుభ్రంగా ఉంచుకుంటే రుణాల బాధ తప్పుతుంది. ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి నుంచి బయట పడతారు.
ఇలా చేస్తే అప్పుల బాధ ఉండదు!
వాస్తు ప్రకారం అప్పుల వలయం నుంచి బయట పడటానికి సులభమైన ప్రక్రియ మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరునికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. దీపారాధన చేయండి. ఆవుపాలతో తయారు చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఇంట్లో వారంతా అది తినాలి. ఈ ఆరాధన కాలసర్ప దోషాన్ని తొలగించడానికి కూడా పనిచేస్తుంది. ఎన్ని ప్రయాత్నాలు చేసినా స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందుకు గురవుతున్నారు అంటే ఆ ఇంట్లో నైరుతీ దోషం కూడా ఉంటుంది. నైరుతీ దిశలో గుంతలు తీసి ఉండటం, పల్లంగా ఉండటం వల్ల ఆ ఇంట్లో వారికి స్థిరమైన జీవనోపాధి ఉండదు అని చెబుతోంది వాస్తు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టాలో తెలుసా? ఆ దిక్కున పెడితే మీకు అన్ని శుభాలే!
'రావి ఆకుపై శ్రీరామ నామం రాస్తే ధనలాభం!'- వాస్తు నిపుణులు చెప్పిన మరికొన్ని సలహాలు మీకోసం