ETV Bharat / spiritual

పనుల్లో అడ్డంకులు వస్తున్నాయా? గురువారం ఈ దేవతను పూజిస్తే పరిష్కారం! - thursday pooja benefits in telugu - THURSDAY POOJA BENEFITS IN TELUGU

Thursday Devi Pooja In Telugu : గృహంలో శాంతి, సౌఖ్యాలు నెలకొనాలా? జీవితంలో అదృష్ట యోగం కలగాలా? ఇవే కాకుండా పుణ్య ఫలాలు పొందడానికి ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ ఆర్టికల్​లో చూద్దాం.

thursday devi pooja in telugu
thursday devi pooja in telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 7:00 PM IST

Thursday Devi Pooja In Telugu : వృత్తివ్యాపారాల్లో రాణించాలని అనుకుంటున్నారా? విద్యార్థులు ఉన్నత విద్యలు చదవాలని చూస్తున్నారా? పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారా? వీటితో పాటు జీవితంలో పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలకు మన శాస్త్రాలు ఎలాంటి సమాధానం ఇస్తున్నాయో ఈ ఆర్టికల్​లో చూద్దాం.

ఈ రోజుల్లో దేవి దర్శనంతో తొలగిపోయే ఆటంకాలు
బుధ, గురువారాల్లో రాజరాజేశ్వరి దేవి, లలితా దేవి, దుర్గాదేవి, గాయత్రి దేవి వంటి దేవతల దర్శనంతో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. సకల కార్య జయం కలుగుతుంది. దీంతో పాటు శ్రీరాములవారి చిత్రపటం ఇంట్లో ఉంటే మిత్రుల నుంచి అన్ని పనుల్లో సహకారం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

ఇలా చేసినట్లయితే ఎనలేని పుణ్యం, చక్కని ఆరోగ్యం!
సాయంకాలం సమయంలో దేవాలయంలోని ధ్వజస్తంభం వద్ద తొమ్మిది వత్తులతో దీపారాధన చేసినట్లయితే పుణ్యఫలం లభిస్తుంది. కోరిన కోరికలు తీరుతాయి. ఈ కార్యక్రమం ఏ దేవాలయంలో అయినా చేయవచ్చు. శుభకార్యాలు కోసం ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ చివరకు శారీరక సహాయం అయినా సరే చేసినట్లయితే అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం.

గురుసేవతో అనాయాస మరణం
వృద్ధ్యాప్యంలో ఉన్న గురువులకు సేవ చేసినట్లయితే పుణ్యంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని పండితులు చెబుతారు. ఇలా చేసిన వారికి అంతిమ సమయంలో ఎవరిచేత కూడా సేవలు చేయించుకోకుండా అనాయాస మరణం దక్కుతుందని శాస్త్రం చెబుతోంది.

ఉన్నత స్థాయి కోసం విద్యార్థులు ఇలా చేయాల్సిందే!
విద్యార్థులు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు ముళ్లు లేని మొక్కలకు నీళ్లు పోస్తే విద్యలో చక్కగా రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పెద్దలు చెబుతున్నారు.

ఇంట్లో సుఖశాంతులు, ధనధాన్యాలు కోసం ఇలా చేయండి
మీ ఇంట్లోని పూజామందిరంలో ప్రతిరోజూ ఉదయం ఆవునెయ్యితో, సాయంత్రం వేళ నువ్వులనూనెతో దీపారాధన చేసినట్లయితే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ధనధాన్యాలతో ఆ ఇల్లు విలసిల్లుతుంది.

విద్యార్థులు అమ్మవారికి ఇలా చేస్తే విజయం మీదే!

విద్యార్థులు పోటీపరీక్షల్లో గొప్ప విజయాలు సాధించాలంటే బుధవారం అమ్మవారి ఆలయంలో అమ్మవారిని తులసి దళాలతో అర్చించాలి. ఇలా ఐదు బుధవారాలు చేస్తే అమ్మవారి దయతో విద్యార్థులకు పోటీపరీక్షల్లో గొప్పగొప్ప విజయాలు సొంతమవుతాయి.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

శనివారం ఉప్పు, నూనెను కొంటున్నారా? అయితే కష్టాలు తప్పవ్​! - Things Do Not Do On Saturday

గురువారం ఈ పూజ చేస్తే జ్ఞానం మీ సొంతం! ఆది గురవని ఎవరిని అంటారు? - pray dakshinamurthy on thursday

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.