ETV Bharat / spiritual

'ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయా? - శుక్రవారం రోజున ఇలా చేస్తే కష్టాలు తీరిపోతాయి' - Astrological Tips - ASTROLOGICAL TIPS

Astrological Tips for Money : కొంతమంది ఎంత సంపాదించినా కూడా.. తమ వద్ద పైసా మిగలట్లేదని బాధపడుతుంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

Money
Astrological Tips for Money (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 23, 2024, 10:17 AM IST

Puja with Cardamom Telugu : శుక్రుడికి ఇష్టమైన యాలకులతో ఒక పరిహారం పాటించడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ పరిహారం పేరు "త్రికోణ యాలకుల దీప పరిహారం". మీరు ఈ పరిహారం ఏ రోజైనా చేయవచ్చని, శుక్రవారం రోజున చేస్తే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల అన్ని ఆర్థిక పరమైన సమస్యలూ తొలగిపోయి.. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారుని చెబుతున్నారు. ఇంతటి శక్తివంతమైన త్రికోణ యాలకుల దీప పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

యాలకులే ఎందుకు తీసుకోవాలంటే..?

ఈ పరిహారం చేయడానికి మనం 108 యాలకులను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే.. యాలకులే ఎందుకు ఉపయోగించాలని చాలా మందికి అనుమానం కలుగుతుంటుంది. యాలకులు శుక్రుడికి ఎంతో ప్రీతికరమైనవి. యాలకులతో పరిహారం చేస్తే శుక్రుడి దోషాలన్నీ తొలగిపోతాయి. దీంతో కుటుంబంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోయి అపారమైన ధనవృద్ధి కలుగుతుంది.

పరిహారం ఇలా చేయండి..

  • ముందుగా వెండి పళ్లెం తీసుకోండి. అందులో కుంకుమతో త్రిభుజాకారం ముగ్గు వేయండి.
  • త్రిభుజం మధ్యలో బియ్యం పిండితో 'శ్రీం' అనే అక్షరం వచ్చేలా గీయండి.
  • ఆ తర్వాత ఒక గిన్నెలో సరిగ్గా 108 యాలకులు తీసుకోవాలి.
  • త్రిభుజం ముగ్గు దగ్గర మూడు వత్తులు వేసి.. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే అగర్​ బత్తులను వెలిగించండి.
  • ఇప్పుడు ఒక్కో యాలకులను తీసుకుని వెండి పళ్లెం మధ్యలో శ్రీం అనే అక్షరంపై ఉంచండి. ఈ సమయంలో "ఓం శ్రీ దైన్య భేదన్య స్వాహాః" మంత్రం జపించండి.
  • ఈ మంత్రం చెబుతూ 108 యాలకులను.. శ్రీం అనే అక్షరంపై ఉంచి.. 108 సార్లు మంత్రం జపించాలి. తర్వాత హారతి ఇవ్వండి.
  • ఇప్పుడు 108 యాలకులను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి బీరువాలో దాచిపెట్టండి.
  • మరుసటి రోజు మళ్లీ ఇదే విధంగా పూజ చేసి.. మూటకట్టి బీరువాలో పెట్టుకోవాలి.
  • ఇలా 21 రోజులపాటు చేయాలి. తర్వాత యాలకులను బీరువాలో పెట్టుకోవాలి.
  • ఒక సంవత్సరం తర్వాత యాలకుల మూటను పారే నీటిలో ఎక్కడైనా విడిచి పెట్టండి.
  • ఈ పరిహారం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోవడంతోపాటు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని మాచిరాజు కిరణ్​ కుమార్ ​పేర్కొన్నారు.

Note: పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

"మంచం మీద వేసే దుప్పట్లపై ఈ గుర్తులు ఉంటే - అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది"!!

"మహిళలు ఈ పనులు చేస్తే - భర్త సంపాదన భారీగా పెరిగిపోతుంది!"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.