ETV Bharat / spiritual

సంతానాన్ని ఇచ్చే 'కొండగట్టు' హనుమ- మంగళవారం దర్శించుకుంటే కోరికలన్నీ నేరవేరుతాయ్​! - Kondagattu Hanuman Temple History - KONDAGATTU HANUMAN TEMPLE HISTORY

Kondagattu Hanuman Temple History : మంగళవారం రోజు ఆంజనేయుడి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే తెలంగాణ జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ కొండగట్టు ఆలయం గురించి మీకు తెలుసా? ఆ మహిమాన్వితమైన గుడి పాముఖ్యత ఎప్పుడైనా విన్నారా? ఆ ఆలయ విశిష్టత ఏంటి?

Kondagattu Hanuman Temple History
Kondagattu Hanuman Temple History
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 5:16 PM IST

Kondagattu Hanuman Temple History : తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ దర్శనం సకల కార్యసిద్ధి కలిగిస్తుంది! మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని సంతానం కోరుకునే వారు సందర్శిస్తే చక్కని సంతానం పొందుతారు. పూజారి నిర్దేశించిన నియమనిష్టల ప్రకారం 45 రోజుల పాటు పూజలు చేస్తే పిల్లలు లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని హనుమాన్ భక్తుల విశ్వాసం. చుట్టూ కొండలు, సెలయేర్లు, పచ్చని ప్రకృతి మధ్యన వెలసిన ఈ ఆలయానికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది.

Kondagattu Hanuman Temple History
కొండగట్టు ఆలయం

ఆలయ స్థల పురాణం ఇదే
ఈ ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే త్రేతా యుగంలో రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా, హనుమ లక్ష్మణుని కోసం సంజీవని తేవడానికి బయలుదేరుతాడు. హనుమ సంజీవనిని తీసుకొని వచ్చేటప్పుడు మార్గమధ్యలో అనగా ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం అయిన ముత్యంపేట గ్రామం వద్ద కొంత భాగము విరిగిపడిందట. ఆ భాగాన్నే కొండ గట్టుగా ప్రస్తుతం మనం పిలుస్తున్నారు.

Kondagattu Hanuman Temple History
కొండగట్టు ఆంజనేయ స్వామి

సంజీవునికి హనుమ స్వప్న సాక్షాత్కారం!
Kondagattu Anjaneya Swamy Temple History : కొండగట్టు ఆలయ చరిత్ర చాలా విశిష్టమైనది. సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు అతడి ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయిందట. సంజీవుడు ఆ అవును వెతుకుతూ అలసి సేద తీరడానికి ఒక చింత చెట్టు కింద విశ్రమించాడంట. అప్పుడు అతడికి స్వప్నంలో ఆంజనేయస్వామి సాక్షాత్కరించి తానిక్కడ కోరంద పొదలో ఉన్నానని, తనకు ఎండ, వాన, ముళ్ల నుంచి రక్షణ కల్పించమని చెబుతారట. అలాగే సంజీవుని ఆవు జాడ కూడా తెలిపి అదృశ్యమయ్యాడట.

వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న సంజీవుడు ఉలిక్కిపడి చుట్టూ తన ఆవు కోసం పరిశీలించి చూడగా శ్రీ ఆంజనేయుడు కనిపించాడట. భక్తిభావం నిండిన మనసుతో సంజీవుడు కంటి వెంట కారుతున్న ఆనందాశ్రువులతో స్వామి వారి పాదాలు కడిగి చేతులెత్తి నమస్కరించాడట. అదే సమయంలో దూరం నుంచి ఆవు 'అంబా' అంటూ పరిగెత్తుకు వచ్చిందంట. వెంటనే సంజీవుడు చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామి వారు విశ్వరూపం, పంచ ముఖాల్లో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడట. ఆ తర్వాత సంజీవుడు తన సహచరులు, గ్రామస్థుల సహకారంతో హనుమంతుడికి చిన్న ఆలయం నిర్మించారట. కొండగట్టు ఆలయ క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి వెలసి ఉన్నారు.

Kondagattu Hanuman Temple History
కొండగట్టులో భక్తుల కోలాహలం (ఫైల్ చిత్రం)

కొండ గట్టులో చూడవలసిన ప్రదేశాలు
కొండగట్టులో ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్‌ ముఖ్యపాత్ర పోషించి నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ కొండగట్టుపై కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళ స్వామి ఆలయం, సీతమ్మ కన్నీటి ధార, కొండల రాయుడి గుట్ట తదితర ప్రదేశాలు చూడదగినవి.

కొండగట్టు హనుమ పూజా విశేషాలు
Kondagattu Hanuman Temple Timings : కొండగట్టు హనుమ ఆలయంలో నిత్యం ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 4.30 నుంచి ఉదయం 5.45 గంటల వరకు స్వామి వారి ఆరాధన వైభవంగా జరుగుతాయి. సంతాన సౌభాగ్యం, సకల కార్య సిద్ధి, అష్టైశ్వర్యాల కోసం కొండగట్టు క్షేత్రాన్ని తప్పక దర్శించాలని చెబుతుంటారు పండితులు.

Kondagattu Hanuman Temple History
విద్యుత్ కాంతుల మధ్య కొండగట్టు క్షేత్రం (ఫైల్ చిత్రం)

'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'

హనుమంతుడు సింధూరం రంగులోనే ఉంటాడెందుకు? - ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.