ETV Bharat / spiritual

గౌరీ వ్రతం నుంచి ఛత్‌ పూజ వరకు - కార్తీక మాసంలోని ముఖ్యమైన పండుగలు ఇవే! - KARTIK MASAM FESTIVAL LIST 2024

పవిత్ర కార్తీక మాసంలోని ముఖ్యమైన పండుగలు - పుణ్యతిథులు ఇవే!

Kartik Month
Kartik Maas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 4:30 AM IST

Kartik Masam Festival List 2024 : మరో రెండు రోజుల్లో పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం కానుంది. కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు విశిష్టమైనది. జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన కార్తీకమాసంలో రానున్న పర్వదినాలు, పుణ్య తిథుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కార్తీక మాసం విశిష్టత
తెలుగు పంచాంగం ప్రకారం, కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఈ నెలలో రావడం వల్ల దీనికి కార్తీక మాసమని పేరు వచ్చింది. పద్మ పురాణం, స్కంద పురాణం ప్రకారం, కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జపాలకు విశేషమైన పుణ్యం లభిస్తుందని తెలుస్తోంది. శివకేశవ భేదం లేకుండా పూజలు, వ్రతాలు జరుపుకునే కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈ మాసంలో ఎలాంటి పర్వదినాలు ఉన్నాయో తెలుసుకుందాం.

కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది?
పరమ పవిత్రమైన కార్తీక మాసం నవంబర్ 2వ తేదీ (శనివారం) నుంచి ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీ(ఆదివారం)తో ముగుస్తుంది. ఈ సందర్భంగా కార్తీకమాసంలో పర్వదినాలు గురించి తెలుసుకుందాం.

  • నవంబర్ 1 (శుక్రవారం): కేదార గౌరి వ్రతం, ఆకాశ దీప ప్రారంభం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
    ఈ రోజు నుంచి మొదలు పెట్టి కార్తీకమాసం నెల రోజుల పాటు ఆకాశదీపాలు పెడతారు. కేదార గౌరీ వ్రతం కూడా ఈ రోజునే చేసుకుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన రోజు.
  • నవంబర్ 2 (శనివారం): కార్తీక శుద్ధ పాడ్యమి - బలిపాడ్యమి, గోవర్ధన పూజ
    ఈ రోజు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెనవ్రేలు మీద ఎత్తి, గొడుగులా పట్టుకుని గోకులాన్ని రక్షించిన రోజు.
  • నవంబర్ 3 (ఆదివారం): కార్తీక శుద్ధ విదియ - భగినీ హస్త భోజనం
    ఈ రోజు యముడు తన సోదరి యమున ఇంటికి భోజనానికి వెళ్లిన రోజు కాబట్టి అన్నదమ్ములు తమ సోదరి ఇంటికి భోజనానికి వెళ్తారు.
  • నవంబర్ 5 (మంగళవారం): కార్తీక శుద్ధ చవితి - నాగుల చవితి
    దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి రోజు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని విశ్వాసం.
  • నవంబర్ 7 (గురువారం): కార్తీక శుద్ధ షష్టి - స్కంద షష్టి
    స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కుజ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
  • నవంబర్ 8 (శుక్రవారం): కార్తీక శుద్ధ సప్తమి - కోటి సోమవారం
    కార్తీకమాసంలో ఏ రోజైతే శుద్ధ సప్తమి, శ్రవణా నక్షత్రం కలిసి వస్తాయో ఆ రోజును కోటి సోమవారంగా జరుపుకుంటారు.
  • నవంబర్ 9 (శనివారం): కార్తీక శుద్ధ అష్టమి - కార్తావీర్యజయంతి, గోపాష్టమి
    కృష్ణ పరమాత్మ తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి నందనవనంలో గోపాలురను రక్షించి ‘గోవర్ధనోర్ధారి’ అన్న నామాన్ని పొందిన పరమ పవిత్రమైన రోజే ఈ గోపాష్టమి.
  • నవంబర్ 11 (సోమవారం): కార్తీకశుద్ధ దశమి - యజ్ఞావల్క జయంతి
    పేద బ్రాహ్మణుడైన యాజ్ఞవల్క్యుడు విదేహ రాజ్యంలో జనక మహారాజు నుంచి వేయి పాడి ఆవులను దానం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
  • నవంబర్ 12 (మంగళవారం): కార్తీక శుద్ధ ఏకాదశి - ప్రభోధానైకాదశి
    ప్రభోధానైకాదశి రోజు చేసే ఉపవాసం, జాగరణలతో విష్ణు కైవల్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నవారు ఈ రోజు తమ వ్రతాన్ని ముగిస్తారు.
  • నవంబర్ 13 (బుధవారం): కార్తీక శుద్ధ ద్వాదశి - కైశిక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి
    క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం రోజు పాల కడలిలో శేష తల్పంపై యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తులసి బృందావనంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు తులసి పూజ విశేషంగా చేస్తారు. అలాగే తులసి కళ్యాణం కూడా జరిపిస్తారు.
  • నవంబర్ 14 (గురువారం): కార్తీక శుద్ధ చతుర్దశి - విశ్వేశ్వర వ్రతం, వైకుంఠ చతుర్దశి, బాలల దినోత్సవం
    కార్తీక శుద్ధ చతుర్దశి రోజున వైకుంఠ చతుర్దశి, విశ్వేశ్వర వ్రతం జరుపుకుంటారు. ఈ రోజున శివుడు కుంఠం అనే రాక్షసుడిని సంహరించాడని పురాణ కథనం. ఈ రోజున శివుని ఆరాధన చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్ర వచనం.
  • నవంబర్ 15 (శుక్రవారం): కార్తీక శుద్ధ పూర్ణిమ - కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం, గురునానక్ జయంతి
    కార్తీక పౌర్ణమి విశేషమైన పర్వదినం. ఈ రోజు శివకేశవుల ఆలయాలలో జ్వాలాతోరణంను నిర్వహిస్తారు. అలాగే అరుణాచలంలో ఆకాశ దీపోత్సవం, సువర్ణముఖి తీర్థ ముక్కోటి, శ్రీ కపిలేశ్వర స్వామికి అన్నాభిషేకం వంటి ఉత్సవాలు జరుగుతాయి.
  • నవంబర్ 16 (శనివారం): కార్తీక బహుళ పాడ్యమి - వృశ్చిక సంక్రమణం
    ఈ రోజు సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.
  • నవంబర్ 19 (మంగళవారం): కార్తీక బహుళ చవితి - అనురాధ కార్తె, సంకష్ట హర చతుర్థి వ్రతం
    ఈ రోజు నుంచి అనురాధ కార్తె మొదలవుతుంది. అలాగే ఈ రోజు సంకష్ట గణపతి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
  • నవంబర్ 26 (మంగళవారం): కార్తీక బహుళ ఏకాదశి, సర్వ ఏకాదశి
    ఈ రోజు ఏకాదశి ఉపవాస, జాగారాలు చేసి శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తే మోక్షం కలుగుతుందని విశ్వాసం.
  • నవంబర్ 27 (బుధవారం): కార్తీక బహుళ ద్వాదశి
    తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ, నాగలాపురం శ్రీ వేదం నారాయణ స్వామి వారి పవిత్రోత్సవం.
  • నవంబర్ 28 (గురువారం): కార్తీక బహుళ త్రయోదశి, గురు ప్రదోషం
    తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఉదయం ద్వజారోహణం, సాయంత్రం చిన శేష వాహనంలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతారు.
  • నవంబర్ 29 (శుక్రవారం): కార్తీక బహుళ చతుర్దశి, మాస శివరాత్రి
    కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు చేసే శివారాధన విశిష్టమైనది. అలాగే ఈ రోజు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు అమ్మవారు ఉదయం పెదశేష వాహనం, సాయంత్రం చిన శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
  • నవంబర్ 30 (శనివారం): కార్తీక బహుళ చతుర్దశి
    ఈ రోజు ఉదయం వరకు 9:35 గంటల వరకు చతుర్దశి తిధి ఉంది కాబట్టి ఈ రోజు అమావాస్య కిందకు రాదు.
  • డిసెంబర్ 01 (ఆదివారం): కార్తీక బహుళ అమావాస్య
    ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈ రోజు అమావాస్య ముగిసి పాడ్యమి వస్తోంది కాబట్టి ఈ రోజు పోలి పాడ్యమిగా జరుపుకుంటారు.పరమ పవిత్రమైన కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు విశిష్టమైనది.

ఆ శివకేశవుల అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ - ఓం నమః శివాయ! జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.