ETV Bharat / spiritual

ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today May 10th 2024 : మే​ 10న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 5:00 AM IST

Horoscope Today May 10th 2024 : మే​ 10న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ ఆస్తులకు సంబంధించి ఒకింత ఆందోళనతో ఉంటారు. దైవానుగ్రహంతో అన్ని సర్దుకుంటాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు తారాబలం అదృష్ట దాయకంగా ఉంది. పూర్తి ఏకాగ్రతతో పని చేసి విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి. జీతం పెరుగుదల ఉంటాయి. దైవబలం అండగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిధు నరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధు మిత్రులతో తీర్ధయాత్రలకు వెళతారు. సమయస్ఫూర్తితో నడుచుకుంటే కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వాహన గండం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వృత్తివ్యాపారాలు చేసేవారికి ఆశించిన ఫలితం రాకపోవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. వ్యాపారులకు పురోగతి ఉండదు. రుణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితుల సహాయంతో ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగులకు పనుల్లో ఆలస్యం చికాకు కలిగిస్తుంది. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం మీ కోపానికి కారణం అవుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ సానుకూల దృక్పధం మీ విజయానికి బాటలు వేస్తుంది. సంఘంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. పితృవర్గం వలన ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు శుభసమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మి కుబేర స్తోత్రం పఠిస్తే ధనప్రవాహం ఉంటుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు వీడండి. యోగా, ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే! మీ ప్రతిభతో వారిని మెప్పిస్తారు. వ్యాపారస్తులకు రావలసిన బకాయిలు చేతి అందుతాయి. వ్యాపార విస్తరణ కోసం రుణాలు చేయాల్సి వస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తె మేలు. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. వివాదాలు, అనారోగ్యం, కోపం కారణంగా ఈ రోజంతా అశాంతిగా ఉండవచ్చు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. దైవానుగ్రహం వలన ఆర్థిక లాభం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు జరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. బాధ్యతలు, తీరిక లేని పనుల నుంచి విశ్రాంతి తీసుకోండి. స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడపండి. విందు వినోదాల్లో పాల్గొనండి. ఆర్ధిక పరమైన ప్రయోజనాలు ఉంటాయి. సామాజిక సేవా రంగంలో ఉండే వారు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉండేవారు అద్భుతాలు సాధిస్తారు. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో సానుకూలత లోపిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. జీవితభాగస్వామితో కలహాల కారణంగా అశాంతిగా ఉంటారు. వ్యాపారస్తులకు నష్టం సూచితం. నూతన ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తారు. గురు శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహాలు అనుకూలంగా లేని సమయంలో ఓర్పుగా వ్యవహరిస్తే మేలు. కోపాన్ని తగ్గించుకొని సహనంతో ఉండండి. వివాదాలకు దూరంగా ఉంటేనే మేలు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు వాయిదా వేయండి. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శని స్తోత్రం పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యావకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలంకరణ సామాగ్రి కోసం ఎక్కువగా ధనవ్యయం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిణితితో ఆలోచించండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదిత్య హృదయం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఈ నిర్ణయాలు అతి త్వరలో ఫలితాన్నిస్తాయి. సృజనాత్మకతతో, దృఢ నిశ్చయంతో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. మీ వృత్తిలో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదివితే శుభ ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.