Horoscope Today March 18th 2024 : మార్చి 18న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
![](https://assets.eenadu.net/article_img/1mesham_44.jpg)
మేషం (Aries) : మేషరాశి వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉన్నదాంట్లో సంతృప్తి చెందే స్వభావం ఉన్నవారు కాబట్టి సంతోషంగా ఉంటారు. మీరు నిర్ణయించుకున్న భవిష్యత్ ప్రణాళికల దిశగా ముందుకు సాగుతారు. మీ భాగస్వామితో విందు వినోదాలలో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/2vrushabham_45.jpg)
వృషభం (Taurus) : వృషభరాశి వారు ఈ రోజు పని ఒత్తిడి నుంచి కొంత విరామం తీసుకొని సరదాగా, ప్రశాంతంగా గడపడం వలన మనసుకు శాంతి లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొని సరదాగా గడుపుతారు. ఒక విందు భోజనం మీకు సంతృప్తిని ఇస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/3mithunam_42.jpg)
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. మీ శక్తియుక్తులతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం చేయండి. తద్వారా మనస్సుకు ప్రశాంతంగా దొరుకుతుంది. దేవాలయ సందర్శన మేలు చేస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/4karkatakam_39.jpg)
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారు ఈరోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కొత్త కొత్త వంటకాలు చేసి కుటుంబ సభ్యుల ప్రశంసలను పొందుతారు. ఇంటికి అతిథుల రాకతో పండగ వాతావరణం నెలకొంటుంది. కాలం సరదాగా గడిచిపోతుంది.
![](https://assets.eenadu.net/article_img/5simham_41.jpg)
సింహం (Leo) : సింహరాశి వారికి ఈరోజంతా లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు, సహోద్యోగుల సహకారం అందుతుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడండి. దీంతో మీరు పొందే ఆనందానికి అవధులు ఉండవు.
![](https://assets.eenadu.net/article_img/6kanya_44.jpg)
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. సహనంతో ఉంటే పనులు సకాలంలో పూర్తి అవుతాయి. విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా ఉంటే మంచిది. ప్రేమికులు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ముందడుగు వేస్తారు.
![](https://assets.eenadu.net/article_img/7tula_41.jpg)
తుల (Libra) : తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీరు పనిచేసే రంగంలో చక్కని సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంటారు. కళల పట్ల అభిరుచి పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
![](https://assets.eenadu.net/article_img/8vrutchikam_42.jpg)
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఒత్తిడిని మీరు సమర్ధంగా ఎదుర్కొంటారు. ఒత్తిడిని పారదోలేందుకు యోగా, ధ్యానం వంటి పనులు చేయండి. మంచి ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/9danassu_40.jpg)
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈరోజు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే కష్టాలు నిత్యం ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ చాకచక్యంతో, నేర్పుగా సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఇచ్చే సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది.
![](https://assets.eenadu.net/article_img/10makaram_43.jpg)
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈరోజు ఏ పని చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. వ్యాపార విస్తరణ పనులు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న రీతిలో పనులు సాగడం మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారంలో అడ్డంకులు తొలగుతాయి. భాగస్వాములు, సహోద్యోగులు సహకరిస్తారు.
![](https://assets.eenadu.net/article_img/11kumbam_43.jpg)
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈరోజు ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రయాణం ఒంటరిగా చేస్తేనే మంచిది. రకరకాల అభిరుచులున్న వ్యక్తులను మీ వెంట తీసుకెళ్తే వారి ప్రాధాన్యాల కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సంయమనం పాటిస్తే అంతా సంతోషంగా, సరదాగా గడుస్తుంది. బలహీనతను బలంగా మార్చుకునే సామర్ద్యం మీకుంది కాబట్టి నిర్భయంగా ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది.
![](https://assets.eenadu.net/article_img/12meenam_44.jpg)
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈరోజు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన పనులు ప్రారంభిస్తే అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. పని ప్రదేశంలో పోటీ వాతావరణం నెలకొంటుంది. ఈ పోటీని మీదైన శైలితో సునాయాసంగా గెలుస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి.