ETV Bharat / spiritual

ఆ రాశివారికి అన్ని పనుల్లో ఆటంకాలే! హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది​! - Daily Horoscope - DAILY HOROSCOPE

Horoscope Today July 15th 2024 : జులై​ 15న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 5:00 AM IST

Horoscope Today July 15th 2024 : జులై​ 15న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి విజయప్రాప్తి ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారు విశేషమైన ప్రతిభతో పనిచేసి విజయపధంలో దూసుకెళ్తారు. వ్యాపారస్థులు వ్యాపారంలో అధికలాభాలు అందుకుంటారు. ఇంటా బయటా మిమ్మల్ని అందరు ప్రశంసలతో ముంచెత్తుతారు. ఉద్యోగులకు విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. సామాజిక సంబంధాలు మెరుగు పడతాయి. మేధోపరమైన చర్చలలో పాల్గొంటారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆరాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్ధిక పురోగతి ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నమ్మించి మోసం చేసే వారి కారణంగా అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. వ్యాపారులకు నూతన వ్యాపారం ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సంతానం ఆరోగ్యం, చదువుల కోసం అధిక మొత్తంలో ధనవ్యయం ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి . ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆలస్యం, ఆటంకాలు ఉంటాయి. తప్పొప్పుల విశ్లేషణ చేసుకుంటూ సందర్భానుసారంగా నడుచుకుంటే మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో కలహాలు ఉండవచ్చు. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. భవిష్యత్ మీద భరోసా ఉంచి ఇష్ట దేవతారాధన చేయండి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలున్నా అధిగమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకండి. వ్యాపారులు పోటీ దారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సంపద పెరుగుతుంది. మీరు మానసికంగా గంభీరంగా ఉంటారు. స్థిరాస్తి రంగం వారికి నూతన వెంచర్లు మొదలు పెట్టడానికి శుభ సమయం. దుర్గారాధన శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీడియా, కమ్యూనికేషన్ రంగాల వారు మంచి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళ్లారు. శివారాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకుంటే కలహాలు ఏర్పడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముంది. ఆపరేషన్ కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వృధా ఖర్చులు ఉండవచ్చు. ఆంజనేయస్వామి దండకం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు లాభదాయకమైన రోజు. కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అన్ని రంగాల వారికి ఆదాయంలో పెరుగుదల, వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుదల ఉండాల్సినంతగా ఉండదు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ వ్యవహారాల్లో అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మేలు. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంతగా సహకరించదు. అన్ని రంగాల వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారంలో పోటీదారుల నుంచి కొత్త సవాళ్లు ఎదురు కావచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆర్థికంగా నష్టాలు ఉండవచ్చు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తెలిసీ తెలియక అనైతికమైన కార్యకలాపాలలో ఇరుక్కోవడం మిమ్మల్ని ప్రమాదంలో పడవేస్తుంది. సమాజంలో పేరున్న వ్యక్తుల మద్దతుతో సమస్యల నుంచి బయట పడతారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. వైద్య ఖర్చుల నిమిత్తం ధనవ్యయం ఉండవచ్చు. దైవబలంపై విశ్వాసం కలిగి ఉండడం వల్ల మేలు చేకూరుతుంది. గణపతి ప్రార్ధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.