ETV Bharat / spiritual

నేడు ఆ రాశి వారికి ప్రశంసలే ప్రశంసలు! ఆరోగ్యం బ్రహ్మాడంగా!! - Daily Horoscope - DAILY HOROSCOPE

Horoscope Today August 23rd 2024 : ఆగస్టు​ 23వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 6:17 AM IST

Horoscope Today August 23rd 2024 : ఆగస్టు​ 23వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. అన్ని రంగాల వారు విజయపథంలో పయనిస్తారు. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ కార్యదీక్షకు, సమర్ధతకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఏ పని చేపట్టినా కష్టనష్టాలు ఎదురు కావడం వల్ల విచారంగా ఉంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అనారోగ్యం కారణంగా ఏ పనులు చేయడానికి ఆసక్తి ఉండదు. మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. వ్యాపారస్థులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే నష్టాలకు గురికావచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వివాహం కానివారికి పెళ్లి నిశ్చయమవుతుంది. ఆర్థిక ప్రయోజనాలకు మంచి రోజు. సమయానికి ధనం అందుతుంది. స్నేహితుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో స్థిరమైన ప్రగతిని సాధిస్తారు. ఆదాయం గణనీయంగా పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్తారు. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఈ రోజులో ఎక్కువభాగం ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నం అవుతారు. తీర్థయాత్రలకు కూడా వెళ్లే సూచనలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. విదేశాల్లో ఉన్న ప్రియమైన వారి నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు వారి భాగస్వాములకు మధ్య చాలా అనుకూలత ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. విలాస వస్తువుల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణతో మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ రోజు ఎదురయ్యే అనారోగ్య సమస్యల కారణంగా అశాంతితో ఉంటారు. వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరుకుంటాయి. కోపావేశాలు తగ్గించుకోకపోతే సన్నిహితులతో సంబంధాలు దెబ్బ తింటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని కోరుకునేవారికి ఈ రోజు మంచిరోజు. ఉద్యోగులకు కూడా ప్రాజెక్ట్ నిమిత్తం విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈరోజు ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. వృత్తి పరంగా, కుటుంబ పరంగా కూడా ఈ రోజు తీవ్ర ఘర్షణలకు ఆస్కారముంది. అందుకే ప్రతికూల పరిస్థితులలో మౌనం వహించడం ఉత్తమం. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. శివారాధనతో మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధించిన ఆందోళనల నుంచి బయట పడతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి చేసే పనిలో అనుకూలతలు ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేసే పనిలో పనిలో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. ఉద్యోగులు పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అశాంతిగా ఉంటారు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. గిట్టని వారు చేసే విమర్శలను పట్టించుకోవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు కార్యసిద్ధి, వృత్తిలో పురోగతి ఉంటాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో శుభయోగాలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. విద్యార్థులు కెరీర్ పట్ల దృఢ నిశ్చయంతో ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆరోగ్యం బాగుటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.