Horoscope Today August 15th 2024 : ఆగస్టు 15న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కొత్త ప్రాజెక్టులు, అసైన్ మెంట్స్ మొదలుపెట్టడానికి మంచి రోజు. ఉద్యోగంలో సవాళ్లు, ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలలో అప్రమత్తంగా ఉండాలి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. కోపాన్ని అదుపులో ఉంచుకోలేని మీ బలహీనత కారణంగా కుటుంబ కలహాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ధననష్టం, ఆస్తి నష్టం సంభవించవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం చేయండి. కీలమైన వ్యవహారాల్లో సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. శివపార్వతుల ఆలయ సందర్శన శుభకరం.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి మీకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీకటాక్షం, పదవీయోగం ఉన్నాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. పదోన్నతులు, ఆదాయం వృద్ధి వంటి శుభ ఫలితాలు ఉంటాయి. మీ సానుకూల వైఖరి కారణంగా అడుగు పెట్టిన ప్రతిచోటా విజయం వెన్నంటే ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోతారు. వృత్తి వ్యాపారాలలో అనారోగ్యం కారణంగా చురుగ్గా పని చేయలేకపోతారు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆలస్యంగానైనా అన్ని పనులు పూర్తవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సహనంతో ఉండండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో చేసిన పొరపాట్లను ఇప్పుడు పశ్చాత్తాపం పొందుతారు. తప్పులు సరిద్దిదుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనల కారణంగా మానసికంగా ఆందోళనకు గురవుతారు. ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. సానుకూల ఆలోచనలతో ఉంటే మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. నవగ్రహ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఈ కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితుల సహకారంతో ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన వృత్తిలో అనవసర విషయాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు ఉండవచ్చు. సమయానుకూలంగా నడుచుకుంటే సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు వివిధ మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చిత్తశుద్ధితో లక్ష్యం వైపు సూటిగా పయనించగలిగితే విజయం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబంలో జరుగుతున్న అనవసర చర్చలకు ముగింపు పలికితే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహసంచారం ప్రకారం ఈ రాశి వారికి వాహన ప్రమాదం సూచన ఉంది. అందుకే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో కూడా సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇంటి వాతావరణంలో ఉత్సాహం, ఆనందం ఉరకలేస్తాయి. దూరప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
కుంభం (Aquarius) : కుంభ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ ఆశించిన దానికంటే గొప్ప ఫలితాలు ఉంటాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపుదల, ఆఫీసులో ప్రశంసలు ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా సాఫీగా సాగిపోతుంది. సంతానం సాధించిన అభివృద్ధి మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కళాకారులకు, రచయితలకు శుభప్రదంగా ఉంది. నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. వ్యాపారంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతమవుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.