2024 Bathukamma Songs With Lyrics : తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక "బతుకమ్మ". తొమ్మిది రోజులపాటు సాగే ఈ ఉత్సవాల్లో ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొంటారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి.. వాటి చుట్టూ చేరి సంతోషంగా ఆడతారు. అయితే.. బతుకమ్మ పండగలో ఆడటం ఎంత ప్రధానమో, పాట కూడా అంతే ప్రధానం.
ఇటు బతుకమ్మల సందడి.. అటు దుమ్ములేపే పాటలతో.. ఊళ్లన్నీ మార్మోగిపోతుంటాయి. అయితే.. ఒకప్పుడు మహిళలే.. "ఒక్కేసి పువ్వేసి చందమామ " అంటూ తమ గాత్రాలతోనే మధురమైన పాటలు పాడేవారు. ఇప్పుడు జనరేషన్ మారింది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సంవత్సరం ఎన్నెన్నో బతుకమ్మ పాటలు వస్తున్నాయి. డీజేలతో మోతెక్కిపోతున్నాయి. ఈ సంవత్సరం(2024) కూడా పలు కొత్త పాటలు యూట్యూబ్లో ఉర్రూతలూగిస్తున్నాయి. అందులో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.
1. ఎన్నడులేనిది నిండుగా పూసినయో
ఎన్నడులేనిది నిండు పున్నమోలే నిండుగా పూసినయో..
రామా అయ్యో రామా అయ్యో నై రామా..
సింగిడార పోసినట్టు నేల మీద రంగుల రాసులమ్మో..
రామా అయ్యో రామా అయ్యో నై రామా..
ప్రకృతి అందాలు పడతి ఆనందాలు కలబోసి విరబూసే పూల పండగ.
2. బతుకమ్మ పండుగొచ్చే
బతుకమ్మ పండుగొచ్చే ఆటలాడుకుందామా పాట పాడుకుందామా..
పాట పాడుకుందమా గౌరమ్మను వేడుకుందామా..
ఆడబిడ్డల పండగొచ్చే పల్లెను తలచుకుందామా చెల్లెలు పిలుచుకుందామా..
చెల్లెలు పిలుచుకుందామా ప్రేమలు పంచుకుందామా.
3. గుమ్మరే గుమ్మా గుమ్మా
గుమ్మరే గుమ్మా గుమ్మా గునుగు పూల జాతరా..
తంగేడు తామరలు తల్లీ నీ చుట్టూరా..
కానలో కొమ్మారెమ్మ కోరి పూలు పంపగా..
వంతపాడుతూ మురిసె వనితలు నిను ఊరూరా.
4. హే పుట్టినాదే పువ్వులల్లో
హే పుట్టినాదే పువ్వులల్లో..
పెరిగినాదే మట్టి మనుషుల చేతులల్లో.. బతుకమ్మయ్యి..
ఓ రామ రామయ్యలో..
హే నేల దిగిన నెలవంక నెత్తి మీద పొడిచినట్టు ఎత్తుకున్న బతుకమయ్యి
శ్రీరామ రామయ్యలో..
5. ఓ శివుని గుమ్మ ఊరువాడ విలిసినాదే
పూల శిలకు పురుడు పోసెనే పులే దారిలో..
పేరు పెట్టి జోల వాడెనే నగాదారిలో..
గావురంగ తీర్చిదిద్దెనే పులే దారిలో..
ఆడబిడ్డలాగా పెంచెనే నగాదారిలో
ఓ శివుని గుమ్మ ఊరువాడ విలిసినాదే..
ఓ పూలకొమ్మ శిప్పి నిన్ను విలిసినాదే..
6. మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో
మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో.. ఓ మామగారు ఉయ్యాలో..
ఈ పువ్వు పేరేమి ఉయ్యాలో.. చెప్పరాదు మామ ఉయ్యాలో..
ఆ పువ్వు పేరోమో ఉయ్యాలో.. నాకు తెల్వబోదే ఉయ్యాలో..
ఆ పువ్వు పేరోమో ఉయ్యాలో.. మీ అత్తనడుగే ఉయ్యాలో..
బతుకమ్మ ఉత్సవాల వేళ ఉర్రూతలూగించే సాంగ్స్ ఇవే - ఒక్కసారైనా విన్నారా?
ఎవరీ బతుకమ్మ? ఎందుకు పండగలా జరుపుకుంటారు? అసలు మ్యాటరేంటి?
తెలంగాణ పూల జాతర 'బతుకమ్మ'- ఈ పండుగ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలు మీకు తెలుసా?