Medak Parliament Election Fight 2024 : మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటికి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. వాస్తవంగా 17 సార్లు జరగాల్సి ఉండగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో దుబ్బాక మండలం పోతారానికి చెందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు.
2019 ఎంపీ ఎన్నిక్లలో బీజేపీ తరుఫున రఘునందన్‌రావు పోటీ చేసి 2,01,567 ఓట్ల సాధించారు. కాంగ్రెస్ తరఫున గాలి అనిల్ కుమార్ 2,79,621 ఓట్లు సాధించి రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక బీఆర్ఎస్ తరఫున కొత్త ప్రభాకర్‌రెడ్డికి 5,96,048 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరి జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. రఘునందన్‌రావు మరోసారి పోటీలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మొదట్లో మెదక్, ఆందోలు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ స్వరూపం మారింది. దీని పరిధిలోని ప్రస్తుతమున్న సంగారెడ్డి, పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు వచ్చి చేరాయి.
కేసీఆర్ పిట్టల దొరలా ఏదేదో మాట్లాడుతున్నారు - పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం
దేశానికి ప్రధానిని అందించిన ఘనత మెదక్దే : దేశానికి ప్రధానిని అందించిన ఘనత ఈ మెతుకు సీమకే దక్కింది. 1980లో మధ్యంతర ఎన్నికలు రావడంతో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆమెకు,15,077 ఓట్లు వచ్చాయి. మెదక్ ఎంపీగా ఉంటూనే ప్రధాని పదవిలో కొనసాగుతూ 1984 అక్టోబరు 31న మరణించారు. మెదక్ లోక్‌సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక సార్లు గెలుపొందింది. ఉపఎన్నికతో కలుపుకొని 18 సార్లు ఎన్నికలు జరగ్గా పీడీఎఫ్, టీపీఎస్, బీజేపీ, టీడీపీ ఒక్కసారి అవకాశం దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థులు తొమ్మిదిసార్లు ఎంపీలుగా గెలుపొందారు. వీరిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన బాగారెడ్డి అత్యధిక సార్లు ఎంపీగా విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డి 1989లో గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆలె నరేంద్ర, మల్లికార్జున్, హన్మంతరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి రెండేసి సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి వరుసగా బీఆర్ఎస్ జయకేతనం ఎగరేస్తూ వస్తోంది. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ తరఫున వెంకటరామిరెడ్డి, బీజేపీ తరఫున రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీలో నిలిచారు. ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
హామీల అమలుపై రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రావాలి : హరీశ్‌రావు
మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ వేసిన వెంకట్రామిరెడ్డి